tikkareddy
-
టీడీపీ ఎమ్మెల్యేలు పదవులు అమ్ముకుంటున్నారు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నామినేటెడ్ పోస్టులు, ఇతరత్రా వ్యవహారాల్లో అధికార తెలుగుదేశం పార్టీ నేతల లంచాల బాగోతాన్ని ఆ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డే బయటపెట్టారు. జిల్లాలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు ప్రతి పదవినీ అమ్ముకుంటున్నారని చెప్పారు. తిక్కారెడ్డి వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆయన సొంత పార్టీ నేతల లంచగొండితనాన్ని వెల్లడించారు. డీలర్‌షిప్‌లు, గ్రామాల్లో పోస్టులకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు లంచాలు తీసుకుంటున్నారని చెప్పారు. టీడీపీ కార్యకర్తల దగ్గరే ఇలా లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కురబ సామాజిక వర్గానికి చెందిన ఓ సాధారణ ఎంపీటీసీ బస్తిపాటి నాగరాజును చంద్రబాబు ఎంపీని చేశారని, ఆయన గ్రామంలో ఓ పోస్టు విషయంలో జోక్యం చేసుకుంటే అక్కడి ఎమ్మెల్యే, ఇన్చార్జి అడ్డుపడ్డారన్నారు. పదవులు ఇచ్చేందుకు ఆయన ఎవరంటూ ఎంపీనే ధిక్కరించారని చెప్పారు. ఎంపీ చెప్పిన వారికి కాకుండా లంచాలు ఇచ్చేవారికి పదవులు ఇస్తారా అని ప్రశ్నించారు. ఎంపీ నాగరాజు కోడుమూరు నియోజకవర్గం పంచలింగాల వాసి. దీన్నిబట్టి చూస్తూ తిక్కారెడ్డి అక్కడి ఎమ్మెల్యే దస్తగిరి, ఇన్చార్జి ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డిపై పరోక్షంగా ఆరోపణలు చేశారని స్పష్టమవుతోంది. జిల్లాలో ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల అవినీతి వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని తిక్కారెడ్డి చెప్పారు. -
మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ పి.తిక్కారెడ్డి అరెస్ట్
ఎమ్మిగనూరు రూరల్: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పి.తిక్కారెడ్డిని తెలంగాణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. లిక్కర్ పరిశ్రమ కోసం రూ.12 కోట్ల విలువైన వరి ధాన్యం తీసుకొని డబ్బు చెల్లించకపోవటంతో బాధితుడు సైబరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు పెట్టినట్లు తెలిసింది. -
తిక్కారెడ్డి.. అదే వంకరబుద్ధి!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి ప్యాలకుర్తి తిక్కారెడ్డి అదే వంకరబుద్ధి చూపుతున్నారు. ప్రజాభిమానం లేకపోవడంతో ఎన్నికల్లో గెలవలేనన్న ఉద్దేశంతో నాటకాలకు తెరలేపారు. అధికార తెలుగుదేశం పార్టీ తమకేమీ చేయలేదని ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న మంత్రాలయం మండలం కగ్గల్ గ్రామ ప్రజలను రెచ్చగొట్టి.. వారిపై అక్రమ కేసులను బనాయించడమే కాకుండా సొంతంగా దాడులు చేసుకుని సింపతీ కొట్టేసేందుకు పన్నాగం పన్నారు. ఇందుకోసం ముందుగానే వేసుకున్న స్కెచ్ ప్రకారం వేటకొడవళ్లతో తనపై దాడి చేశారంటూ విషప్రచారానికి పూనుకున్నారు. అయితే.. చివరకు కొన్ని వీడియోలు బయటకు రావడంతో నాటు తుపాకీతో కాల్చారంటూ కొత్త నాటకానికి తెరతీశారు. గ్రామంలో జరిగిన మొత్తం ఘటన వీడియో బయటకు వచ్చింది. గన్‌మెన్ ఫైరింగ్‌లోనే తిక్కారెడ్డికి గాయమైనట్టు తేలింది. దీంతో వేటకొడవళ్లు, నాటుతుపాకీ నాటకం కాస్తా తుస్సుమని తేలిపోయింది. ఏం జరిగింది? మంత్రాలయం టీడీపీ టికెట్ ప్రకటించిన తర్వాత తిక్కారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి అంతగా స్పందన కనిపించకపోవడంతో కొత్త నాటకానికి తెరలేపారు. వాస్తవానికి కోసిగి మండలం ఐరన్గల్ గ్రామంలో ప్రచారానికి వెళుతున్నానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, ఇందుకు భిన్నంగా మంత్రాలయం మండలం కగ్గల్ గ్రామానికి వెళ్లారు. ఎంపిక చేసుకున్న అనుకూల మీడియా వారిని మాత్రమే వెంట తీసుకెళ్లారు. తమ గ్రామాన్ని కనీసం పట్టించుకోకుండా ఇప్పుడు ఓట్ల కోసం వస్తారా అని నిలదీసేందుకు గ్రామస్తులు సిద్ధం కావడంతో తిక్కారెడ్డి నాటకానికి తెరలేపారు. ముందే వేసుకున్న స్కెచ్ ప్రకారం తన సొంత గన్మెన్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఇందులో మిస్‌ఫైర్ కావడంతో తిక్కారెడ్డికి కూడా గాయాలయ్యాయి. అయితే, వేటకొడవళ్లతో దాడులు చేశారని మొదట్లో లీకులిచ్చిన తిక్కారెడ్డి..చివరకు ప్రైవేటు తుపాకీతో కాల్చారని కట్టుకథలు అల్లారు. అయితే.. అక్కడ ఉన్న కొద్ది మంది మొత్తం వ్యవహారాన్ని తమ సెల్ఫోన్ల ద్వారా రికార్డు చేయడంతో తిక్కారెడ్డి అసలు స్వరూపం బయటపడింది. ఆయనపై ఎవరూ దాడి చేయలేదని, గన్‌మెన్ ఫైరింగ్‌లోనే గాయాలయ్యాయని తేలిపోయింది. గత ఎన్నికల్లోనూ ఇదే విధంగా రాంపురం గ్రామానికి ప్రచారం పేరుతో వెళ్లి కట్టెలతో దాడులు చేశారంటూ నాటకాలు ఆడారు. అప్పుడు కట్టెలు... ఇప్పుడు వేటకొడవళ్లు, తుపాకీ అంటూ నాటకం మారిందని అక్కడి ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. అబద్ధాన్ని నిజం చేసేందుకు తాపత్రయం.. మంత్రాలయం నియోజకవర్గంలోని కగ్గల్ గ్రామంలో తనపై వేటకొడవళ్లతో, నాటు తుపాకులతో దాడి జరిగిందని నమ్మించేందుకు అధికారపార్టీ అభ్యర్థి తిక్కారెడ్డి తిప్పలు పడ్డారు. ఈ అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు వరుసగా సామాజిక మాధ్యమాల సాక్షిగా ప్రయత్నించారు. ఇక ‘ట్విట్టర్’ మంత్రి లోకేష్.. ‘ ప్రచారానికి వెళ్లిన వారిపై వైఎస్సార్ సీపీ వారు దాడిచేయడంతో టీడీపీ నేత తిక్కారెడ్డి ఏఎస్ఐ గాయపడ్డారు.. ప్రచారం చేసుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని కూడా వైసీపీ రౌడీలు కాలరాస్తున్నారు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. మిగిలిన టీడీపీ నేతలు కూడా తిక్కారెడ్డిని చంపేందుకు ప్రయత్నించారంటూ తీవ్రంగా ఖండించే ప్రయత్నం చేశారు. అయితే, మొత్తం ఘటనపై కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప..ఆదోని డీఎస్పీ వెంకటరాముడు ఆధ్వర్యంలో విచారణ జరిపించారు. తీరా విచారణలో ప్రైవేట్ వ్యక్తులెవ్వరూ కాల్పులు జరపలేదని తేల్చారు. అంతేకాకుండా గన్మెన్లు అత్యుత్సాహం ప్రదర్శించి.. అవసరం లేనప్పటికీ కాల్పులు జరిపి క్రమశిక్షణ ఉల్లంఘించారని తేలింది. దీంతో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించినందుకు గానూ ఇద్దరు గన్మెన్లు (ఎంసీ శ్రీనివాసులు, ఆర్ విజయ్‌కుమార్)ను ఎస్పీ సస్పెండ్ చేశారు. పోలీసుశాఖలో విధుల పట్ల అలసత్వం వహించి క్రమశిక్షణ ఉల్లంఘిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప హెచ్చరించారు. -
కగ్గల్లులో కాల్పుల కలకలం
-
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గన్‌మెన్ కాల్పులు
సాక్షి, కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం మండలం కగ్గల్లులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి శనివారం ఉదయం ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ సమయంలో తిక్కారెడ్డిని గ్రామస్తులు అడ్డుకుంటారనే అనుమానంతో ఆయన గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. గన్‌మెన్ జరిపిన కాల్పుల్లో తిక్కారెడ్డితోపాటు, అక్కడే ఉన్న ఏఎస్సై గాయపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. -
బాబును ముప్పు‘తిప్ప’లు పెట్టింది
కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకొని ఎంతోకాలంగా పార్టీకి సేవలందిస్తున్న తమ్ముళ్లకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబబాబు నాయుడు చేయిచ్చారు.. ఆ తర్వాత పలుమార్లు అభ్యర్థులను మార్పు చేశారు.. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోసిగి బహిరంగ సభలో మంత్రాలయం అభ్యర్థిని ప్రజలకు పరిచయం చేస్తూ.. పాలకుర్తి తిక్కారెడ్డికి బదులుగా తిప్పారెడ్డి అని పేర్కొనడం తమ్ముళ్లకు నవ్వు తెప్పించింది. ఏదో పొరపాటు అన్నారనుకుంటే.. మూడుసార్లు ఇదే పేరు ఉచ్ఛరించడం గమనార్హం. పక్కనే ఉన్న ఎంపీ అభ్యర్థి బి.టి.నాయుడు పేరు తప్పని పదేపదే ఆయన చెవు కొరికినా ఫలితం లేకపోయింది. మొత్తానికి తిక్కారెడ్డి పేరు బాబును ముప్పు‘తిప్ప’లు పెట్టింది.