శ్రీమఠంలో భక్తుల సందడి
శ్రీమఠంలో భక్తుల సందడి
Published Sun, Feb 12 2017 9:58 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM
మంత్రాలయం : ప్రముఖ శ్రీరాఘవేంద్రస్వామి మఠం భక్తుల రద్దీతో సందడిగా మారింది. ఆదివారం సెలవు కావడంతో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి భక్తులు వేలాది తరలివచ్చారు. తుంగభద్ర నదీలో పుణ్యస్నానాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు అర్చనలు చేసుకున్నారు. తర్వాత రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. బృందావన దర్శన, మంచాలమ్మ, అన్నపూర్ణభోజనశాల, పంచామృతం, పరిమళ ప్రసాదాల వద్ద భక్తులు బారులు తీరారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో రాఘవేంద్రుల బృందావన ప్రతిమకు ఊంజలసేవ, బంగారు పల్లకిసేవలు గావించారు. పూజోత్సవాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
Advertisement