
శ్రీమఠంలో సినీ నటి ప్రేమ
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం సినీ నటి ప్రేమ గురువారం మంత్రాలయం వచ్చారు. ముందుగా ఆమె గ్రామ దేవత మంచాలమ్మకు కుంకుమార్చన, హారతులు పట్టారు. అనంతరం రాఘవేంద్రుల మూలబృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ఆమెకు శేషవస్త్రం, ఫల, పూల, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.