ఫ్యాన్ గాలిని ఎవరూ ఆపలేరు | win in elections ysrcp | Sakshi
Sakshi News home page

ఫ్యాన్ గాలిని ఎవరూ ఆపలేరు

Published Mon, Apr 21 2014 11:49 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

win in elections ysrcp

మంత్రాలయం, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గుర్తు ప్రభంజనం సృష్టిస్తుందని వైఎస్సార్‌సీపీ మంత్రాలయం అభ్యర్థి బాలనాగిరెడ్డి అన్నారు. దీన్ని ఆపడం ఎవరి తర మూ కాదన్నారు. పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని, జగన్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఆరోపణలు చేసినా ఎన్నికల్లో ప్రజాతీర్పు ముందు దిగదుడుపేనని పేర్కొన్నారు.

సోమవారం ఆయన మంత్రాలయంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్రుల మూలబృందావ నానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత ఊరిలో ఉద యం 11.50 నుంచి ప్రచారం మొదలెట్టిన బాలనాగిరెడ్డి కోట వీధి, పంప్‌హౌస్ గేరి, వెంకటేశ్వరస్వామి వీధుల్లో ఓట్లు అభ్యర్థించారు.   వైఎస్సార్ మరణం తర్వా త అనేక ఇబ్బందులకు గురవుతున్న జనం జగన్‌మోహన్‌రెడ్డిపై ఆశలు పెట్టుకున్నారని బాలనాగిరెడ్డి తెలిపారు.  

ఇందుకోసం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ భీమారెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, నాయకులు వెంకటేష్‌శెట్టి, విశ్వనాథ్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, ప్రభాకర్‌ఆచారి, వడ్డెప్పస్వామి, ఐపీ నరసింహమూర్తి, వీరన్నశెట్టి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement