శ్రీమఠంలో కర్ణాటక డీజీపీ
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం కర్ణాటక డీజీపీ జైల్స్ సత్యనారాయణరావు శనివారం మంత్రాలయం వచ్చారు. మఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి మఠం మర్యాదలతో ఆహ్వానం పలకగా ఆయన ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. రాఘవేంద్రుల మూలబృందావనం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అనంతరం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు రాఘవేంద్రుల జ్ఞాపిక అందజేసి ఆశీర్వదించారు. గుల్బర్గ జైల్స్ ఎస్పీ సోమశేఖర్, సీఐ నాగేశ్వరరావు, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు.