వైభవం.. ముంజీ మహోత్సవం
వైభవం.. ముంజీ మహోత్సవం
Published Thu, Feb 16 2017 10:24 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM
– శాస్త్రోక్తంగా పీఠాధిపతి పూర్వాశ్రమ పుత్రుడికి యజ్ఞోపవీతం
– వేలాది మంది భక్తుల మధ్య సాగిన జంజధారణ
మంత్రాలయం: ప్రముఖ శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు పూర్వాశ్రమ పుత్రుడు అప్రమేయ ముంజీ మహోత్సవం వైభవంగా సాగింది. గురువారం పీఠాధిపతి ఆశీస్సులతో వేద పాఠశాల ఆవరణలో అప్రమేయ చేతుల మీదుగా హోమాలు చేపట్టారు. శాస్త్రోక్తంగా పండిత కేసరి గిరియాచార్ అప్రమేయకు యజ్ఞోపవీతం కానిచ్చారు. పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల సుస్వరాలు, అశేష భక్తజన సందోహం మధ్య జంజధారణ గావించారు. పీఠాధిపతి పూర్వాశ్రమ తండ్రి పండితకేసరి గిరియాచార్ సమక్షంలో పండిత మహాశయులు అప్రమేయకు జంజం తొడిగించారు. ఉదయం 10.15 గంటలకు శుభ మేషలగ్న, వృషభాంశ గడియలో ముంజీ చేశారు.
ముందుగా ప్రత్యేక హోమాలు చేపట్టి పుష్పశోభిత సభపై మంత్రజపాల మధ్య యజ్ఞోపవీతం ముగించారు. అనంతరం అప్రమేయ పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల పాద పూజ చేసుకున్నారు. టీటీడీ కల్యాణ మండప ఆవరణలో భోజనాలు నిర్వహించారు. వేడుకలో బెంగళూరు ఎమ్మెల్యే అరవింద లింబావలి, విజయ్‌కుమార్, ఎమ్మెల్సీ నారాయణస్వామి హాజరయ్యారు. కార్యక్రమంలో ఆప్త కార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, మఠం ఈఈ సురేష్ కోనాపూర్, పాఠశాల ప్రిన్సిపాల్ వాదీరాజాచార్ పాల్గొన్నారు.
Advertisement