నదిలో దూకిన గర్భిణీ | Pregnant woman attempts suicide | Sakshi
Sakshi News home page

నదిలో దూకిన గర్భిణీ

Published Tue, Sep 8 2015 4:48 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

Pregnant woman attempts suicide

మంత్రాలయం (కర్నూలు) : అత్తింటి ఆరళ్లతో ఓ గర్భిణీ నదిలో దూకింది. ఈ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని తుంగభద్ర గ్రామానికి చెందిన మాధవి(20)కి ఏడాది కిందట వివాహమైంది. అయితే ఆమె ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. కాగా మంగళవారం ఆమెకు భర్త తరపు కుటుంబసభ్యులతో వాగ్వాదం జరిగింది. దీంతో మనస్థాపం చెంది ఆమె నదిలో దూకింది. కుటుంబసభ్యులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకూ ఆమె ఆచూకీ తెలియలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement