మంత్రాలయంలోని దుండగులు చోరీకి పాల్పడ్డారు. అన్నపూర్ణ భోజనశాల హుండీని దుండుగులు అపహరించుకు వెళ్లారు
మంత్రాలయం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శ్రీమఠం అన్నపూర్ణ భోజనశాలలో దొంగలు చొరబడి అక్కడ ఏర్పాటు చేసిన ప్రధాన హుండీ తాళం పగులగొట్టి అందులోని నగదు దోచుకెళ్లారు. దొంగిలించిన సొమ్ము లక్షల్లో ఉంటుందని మఠం అధికారులంటున్నారు.
మరోవైపు... శ్రీమఠంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే మీ వస్తువులు మీరే చూసుకోవాలంటూ నిర్లక్ష్యంగా బదులిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోణపలై సీఐ ప్రకాష్‌ను వివరణ కోరగా... ఆయన మీడియాపైనే విరుచుకుపడ్డారు. 2012లోనూ దుండగులు అన్నపూర్ణ భోజనశాలలో హుండీని దోచుకు వెళ్లిన విషయం తెలిసిందే.
మరోవైపు నల్లగొండ జిల్లాలో దొంగలు చెలరేగిపోయారు. తిప్పర్తి మండల కేంద్రంలో 8 దుకాణాల తాళాలు పగులగొట్టి నగదు దోచుకెళ్లారు. 2 లక్షలకు పైగా సొమ్ము ఎత్తుకుపోయారని, దొంగల కోసం గాలింపు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. వారం క్రితం నార్కట్‌పల్లిలో మొబైల్‌షాపుల్లో కూడా ఇలాగే దొంగతనాలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు.