బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్‌ థ్రిల్లర్‌..! | Vijay Antony Latest Crime Thriller Movie Raththam Successfully Running In Theatres, Collections Details Inside - Sakshi
Sakshi News home page

Vijay Antony Raththam Collections: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న 'రత్తం'.. ఫుల్ ఖుషీలో విజయ్ ఆంటోనీ ఫ్యాన్స్!

Oct 12 2023 8:03 AM | Updated on Oct 12 2023 9:31 AM

Vijay Antony Latest Crime Thriller Movie Successfully Running In Theatres - Sakshi

విజయ్‌ ఆంటోని, నందితాశ్వేతా, రమ్యానంభీశన్‌, మహిమా నంబియార్‌  ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం రత్తం. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి సీఎస్‌ అముదమ్‌ దర్శకత్వం వహించారు. ఈయన ఇంతకుముందు తమిళ్‌ పడం, తమిళ్‌పడమ్‌–2 వంటి వినోదభరిత కథాచిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పూర్తి భిన్నంగా క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ఇతివృత్తంతో రూపొందించారు. ఇటీవలే బిచ్చగాడు-2 సినిమాతో హిట్‌ అందుకున్నారు విజయ్ ఆంటోని. క్రైమ్‌ థ్రిల్లర్‌ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

కథేంటంటే..

ముఖ్యంగా మీడియా నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం రత్తం. చిత్ర ప్రారంభంలోనే ఒక పత్రిక సహాయ సంపాదకుడిని ఆయన కార్యాలయంలోనే ఒక వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేస్తాడు. చనిపోయిన వ్యక్తి విజయ్‌ ఆంటోనికి మిత్రుడు. కాగా ఇంతకుముందు పత్రికలో పనిచేసిన విజయ్‌ఆంటోని ఈ తరువాత జర్నలిజానికి దూరంగా వేరే ప్రపంచంలో జీవిస్తుంటారు. అలాంటిది ఆయన మళ్లీ మీడియా ప్రపంచంలోకి రావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు కారణం ఏమిటి? జరుగుతున్న హత్యలకు కారణం ఎవరూ? వంటి అంశాలపై ఆయన ఇన్వెస్టిగేషన్‌ మొదలెడతారు. అయితే ఆ మిస్టరీని ఆయన ఛేదిస్తారా? అందుకు ఎలాంటి సాహసానికి పూనుకుంటారు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రం రత్తం. ఇటీవలే విడుదలైన ఈ చిత్రాని ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 

విషాదం

కాగా.. ఇటీవలే విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన పెద్ద కుమార్తె మానసిక ఒత్తిడితో బలవన్మరణానికి పాల్పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement