సిక్కోలుకు సత్యదేవుడు
సిక్కోలుకు సత్యదేవుడు
Published Wed, Mar 1 2017 10:51 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM
ధర్మ ప్రచారానికి తరలిన ప్రచార రథం
నేటి నుంచి జిల్లాలో వివిధ పట్టణాల్లో పర్యటన
అన్నవరం : సత్యదేవుని ధర్మ ప్రచారరథం బుధవారం శ్రీకాకుళం జిల్లాకు బయల్దేరింది. రత్నగిరిపై ఈ ప్రచార రథానికి అన్నవరం దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు జెండా ఊపి పర్యటనను ప్రారంభించారు. ఈ ప్రచారరథం శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస, పాలకొండ, వీరఘట్టం, కొత్తూరు, పాతపట్నం, కోరసవాడ, తుంబూరు, సారవకోట, శ్రీముఖ లింగం, నర్సరావుపేట, శ్రీకాకుళం, తదితర పట్టణాలలో ఈ నెల రెండో తేదీ నుంచి పర్యటించనుందని ఈఓ తెలిపారు. ప్రచారరథంలోని సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తుల దర్శనం, వీలున్న చోట స్వామి, అమ్మవార్ల శాంతికల్యాణాలు కూడా నిర్వహిస్తారని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement