ధనలక్ష్మితో డీల్! | deal with dhanalaxmi | Sakshi
Sakshi News home page

ధనలక్ష్మితో డీల్!

Published Fri, Mar 4 2016 11:10 PM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM

ధనలక్ష్మితో డీల్!

ధనలక్ష్మితో డీల్!

సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం ‘డీల్ విత్ ధనలక్ష్మి’. మానస్, పూజిత, అంజలి, అర్చన, విజయభాస్కర్ రెడ్డి, సత్య ప్రధాన పాత్రల్లో వెంకట్ ప్రసాద్ (బాబీ) దర్శకత్వంలో ఏవీయస్ శ్రీనివాస్, కవిత సింహాచలం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇది పదిమంది కోసం పాటుపడే యువకుడి కథ . వినోద ప్రధానంగా నడిచే సస్పెన్స్ థ్రిల్లర్’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ నెల 10 నుంచి 30 వరకూ రాజమండ్రి, తాపేశ్వరం, సిద్దాంతం ప్రాంతాల్లో ఒక షెడ్యూల్ చేస్తాం. ఏప్రిల్ 7 నుంచి 25 వరకూ హైదరాబాద్‌లో జరిపే రెండో షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: డా. జోశ్యభట్ల, కెమేరా: ఏవీ శ్రీనివాస్(బాబు).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement