song recording
-
వరల్డ్ రికార్డ్ టార్గెట్‌గా ‘నీకు... నాకు... రాసుంటే’
ఈశ్వర్, సాయివిక్రాంత్, రిషి, సూర్య ప్రధాన పాత్రల్లో..యష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్రవంతి పలగని, అభిషేక్ ఆవల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నీకు..నాకు..రాసుంటే’. కె.ఎస్. వర్మ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సాంగ్ రికార్డింగ్, బ్యానర్ లాంచింగ్ హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సందర్భంగా ప్రముఖ గాయని సునీత మాట్లాడుతూ.. తెలుగులో యశ్‌రాజ్ పేరుతో బ్యానర్ స్థాపించడంతోనే సగం విజయం సాధించారు నిర్మాతలు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం దర్శకులు వర్మ గారే 24 క్రాఫ్ట్స్ చేస్తున్నారు. ఈ ప్రయోగం ఒక మంచి ప్రయోగంగా మిగిలి పోవాలి. యూనిట్ అందరికీ నా బెస్ట్ విషెస్. నేను లైవ్‌లో ఓ సినిమాకు పాట పాడటం ఇదే తొలిసారి. ఇది కూడా ఓ రికార్డ్ అనుకుంటా. నాకు ఈ ప్రయోగాత్మక చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. దర్శకుడు కె.ఎస్. వర్మ మాట్లాడుతూ..ప్రపంచ రికార్డు కోసం 24 క్రాఫ్ట్స్ ను నేనే నిర్వహిస్తున్నాను. దీన్ని లైవ్ రికార్డు కూడా చేస్తాం. తప్పకుండా మా కష్టానికి తగ్గట్టుగా ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను. మా సినిమాలో జాతీయ అవార్డు పొందిన ఓ ప్రముఖ హీరోయిన్ ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు.. ఇందుకు చర్చలు జరుగుతున్నాయి అన్నారు. నిర్మాతలు స్రవంతి పలగని, అభిషేక్ ఆవల మాట్లాడుతూ.. భారత దేశం గర్వించే సినిమాలు చేసిన యశ్‌రాజ్ ఫిలింస్‌ని దృష్టిలో పెట్టుకుని మా బ్యానర్‌కు ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ ఏడాది మూడు సినిమాలు నిర్మించాలనుకుంటున్నాం.. అన్ని సినిమాల్లో కొత్తవారికి అవకాశాలు ఇస్తాం. మే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, హైదరాబాద్, అరకు, వైజాగ్, మంగళూరు, ఊటీ, చెన్నై తదితర లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతాం’అన్నారు.ఈ కార్యక్రమంలో హీరోలు ఈశ్వర్, సాయివిక్రాంత్, రిషి, సూర్య తదితరులు పాల్గొన్నారు. సత్యరాజ్, సుమన్, అలీ, రఘుబాబు, గౌతంరాజు, తనికెళ్ల భరణి, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా సురేష్‌బాబు వ్యవహరిస్తున్నాడు. -
తొలిసారి లక్షద్వీప్‌లో నీలి తిమింగలం పాట రికార్డు
న్యూఢిల్లీ: లక్షద్వీప్‌లో పిగ్మి నీలి తిమింగలాలున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. తాజాగా లక్షద్వీప్‌లో తొలిసారి పిగ్మి నీలి తిమింగలం పాట రికార్డ్ చేసినట్లు తెలిపారు. యూనివర్శిటీ ఆఫ్ ఓషనోగ్రఫీలో పీహెచ్డీ చేస్తున్న దివ్య పానికర్ ఈ విషయాన్ని తెలిపారు. ఈమె గత ఆరు సంవత్సరాలుగా తిమింగలాల మీద పరిశోధనలు చేస్తున్నారు. కేరళకు చెందిన దివ్య పానికర్ 2015లో తొలిసారి లక్షద్వీప్‌ను సదర్శించారు. ఆ సమయంలో ఆమె పలువురు జాలర్లును కలిసి మాట్లాడారు. వారిలో చాలామంది తాము లక్షద్వీప్‌లో పెద్ద పెద్ద తిమింగలాలను చూసినట్లు ఆమెకు చెప్పారు. దీనికంటే ముందే పలు శాస్త్రవేత్తల సమూహాలు హిందూ మహాసముద్రంలో అంతరించిపోతున్న పలు జాతులకు చెందిన జీవజాతులున్నట్లు వెల్లడించారు. అయితే ఇవన్ని ఇక్కడే స్థిరంగా ఉండేవా.. లేక వలస వచ్చినవా అనే దాని గురించి చెప్పలేకపోయారు. ఈ క్రమంలో గత ఆరేళ్లుగా ఇక్కడ పరిశోధనలు చేస్తున్న దివ్య పానికర్ వీటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘తొలిసారి ఈ నీటిలో పిగ్మి నీలి తిమింగాలాల పాట రికార్డు చేశాం. ఇక లక్షద్వీప్‌లో ఇవి ఉన్నాయనే దానికి నిదర్శనం ఈ పాట’’ అన్నారు. ‘‘గత కొన్నేళ్లుగా సాంకేతిక రంగంలో జరిగిన అభివృద్ధి ఈ పరిశోధనకు చాలా మేలు చేసింది. ధ్వని తరంగాలను గుర్తించడం ద్వారా స్వరం ఉన్న సముద్ర క్షీరదాలను గుర్తించగల్గుతాం. తిమింగలాల కదలికలను గమనించడం చాలా కష్టం. ఇవి ఎక్కువ దూరం ప్రయాణం చేయడమే కాక.. నీటి లోపల ఎక్కువ సమయం ఉంటాయి. అందుకే ధ్వని దార్వా వీటిని గుర్తిస్తాం. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్లో నేను ధ్వని ద్వారా సముద్ర క్షీరదాల జనాభా, పంపకాన్ని ఎలా లెక్కించవచ్చు అనే దాని గురించి నేర్చుకున్నాను’’ అని దివ్య పానికర్ తెలిపారు. ‘‘ఈ పరిశోధనల కోసం నేను డిసెంబర్, 2018లో సముద్రం లోపలికి వెళ్లి తిమింగలాలు చేసే ధ్వనిని రికార్డ్ చేయడం కోసం కవరత్తి ద్వీపం రెండు చివర్ల మైక్రోఫోన్స్ అమర్చి వచ్చాను. వీటిని విశ్లేషించగా.. ఏప్రిల్-మే నెలల మధ్య వీటి కార్యకలాపాలు గరిష్టంగా ఉన్నట్లు తెలిసింది. పిగ్మి నీలి తిమింగలం పాటలు నైరుతి రుతుపవన కాలమైన ఏప్రిల్-మేలో గరిష్టంగా ఉంటున్నాయి. దీన్ని బట్టి.. పిగ్మి నీలి తిమింగలాలు లక్షద్వీప్ ప్రాంతాన్ని కాలాల వారిగా వాడుకుంటున్నట్లు తెలిసింది’’ అన్నారు దివ్య పానికర్. 1960-70 కాలంలో సోవియట్ వేలింగ్ రికార్డు ప్రకారం లక్షద్వీప్ ప్రాంతలో నీలి తిమింగలాలున్నట్లు వెల్లడించింది. -
అంతా బాగుంటాం రా
కరోనా పోరాటానికి స్ఫూర్తి నింపడానికి తమకు తోచిన విధంగా తమ స్టయిల్లో పాటలు విడుదల చేస్తున్నారు స్టార్స్. తాజాగా మంచు మనోజ్ కరోనాపై పోరాటం చేస్తున్న వారికి భరోసా ఇవ్వడానికి ఓ పాటను రికార్డ్ చేశారు. వచ్చే వారం ఈ పాట విడుదల కాబోతోంది. ఈ విషయం గురించి మనోజ్ మాట్లాడుతూ –‘మూడు సంవత్సరాల విరామం తర్వాత మంచి సినిమా (మనోజ్ హీరోగా ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమా పూజా కార్యక్రమాలు లాక్ డౌన్‌కి కొన్ని రోజుల ముందు జరిగాయి) తో మిమ్మల్ని పలకరిద్దాం అనుకున్నాను. మనమంతా ఒక స్క్రిప్ట్ రాసుకుంటే దేవుడు మరొక స్క్రిప్ట్ రాస్తాడు. ‘యాక్షన్’ అన్న పదం వినే అదృష్టాన్ని ఇంకొన్ని రోజులు దూరం జరిపాడు. వచ్చే వారం డాక్టర్లకు, పోలీసులకు, ఆర్మీకి, పారిశుధ్య కార్మికులకు ముఖ్యంగా వాళ్ల త్యాగానికి ‘అంతా బాగుంటాం రా’ అనే పాటను అంకితం చేస్తున్నాను. సంగీత దర్శకుడు అచ్చు స్వరపరిచిన ఈ పాటను నేను, నా మేనకోడలు విద్యా నిర్వాణ (మంచు లక్ష్మి కుమార్తె) కలిసి పాడి, పాట రూపంలో ఇస్తున్న చిన్న భరోసా ఇది’’ అన్నారు. -
సరికొత్త ప్రేమ
దేవదాస్ హీరోగా చందు అజ్మీర దర్శకత్వంలో సాయిదత్తా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. శైలజ నిర్మిస్తున్న చిత్రం పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. ఇందులో హాసిని కథానాయిక. శైలజ కె. మాట్లాడుతూ – ‘‘చందు చెప్పిన కథ బాగుంది. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది. దేవదాస్‌లో మంచి ప్రతిభ ఉంది. ఈ నెల చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి, రెండు షెడ్యూల్స్‌లో సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మాస్ల్, క్లాస్ ఆడియన్స్‌కు నచ్చేలా ప్రేమను సరికొత్త రూపంలో చూపించబోతున్నాం. సినిమాలో నాలుగు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయి’’ అన్నారు చందు అజ్మీర. ‘‘అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్. మంచి పాత్ర చేస్తున్నా’’ అన్నారు దేవదాస్. ఈ సినిమాకు సంగీతం: డేవిడ్ జి. పాటలు: చంద్రబోస్, సుద్ధాల అశోక్ తేజ. -
ధనలక్ష్మితో డీల్!
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం ‘డీల్ విత్ ధనలక్ష్మి’. మానస్, పూజిత, అంజలి, అర్చన, విజయభాస్కర్ రెడ్డి, సత్య ప్రధాన పాత్రల్లో వెంకట్ ప్రసాద్ (బాబీ) దర్శకత్వంలో ఏవీయస్ శ్రీనివాస్, కవిత సింహాచలం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇది పదిమంది కోసం పాటుపడే యువకుడి కథ . వినోద ప్రధానంగా నడిచే సస్పెన్స్ థ్రిల్లర్’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ నెల 10 నుంచి 30 వరకూ రాజమండ్రి, తాపేశ్వరం, సిద్దాంతం ప్రాంతాల్లో ఒక షెడ్యూల్ చేస్తాం. ఏప్రిల్ 7 నుంచి 25 వరకూ హైదరాబాద్‌లో జరిపే రెండో షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: డా. జోశ్యభట్ల, కెమేరా: ఏవీ శ్రీనివాస్(బాబు). -
‘కళింగ’ ఆశయం...
శ్రీహరి హీరోగా పోలీస్, దేవా, సాంబయ్య తదితర చిత్రాలు డెరైక్ట్ చేసిన కేయస్ నాగేశ్వరరావు తాజా ప్రయత్నం ‘కళింగ’. సతీశ్‌బాబు హీరోగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మండవ శాంతిశ్రీ నిర్మించనున్నారు. భారీ నిర్మాణ వ్యయంతో, పూర్తి వాణిజ్య హంగులతో ఈ సినిమా చేయనున్నామని, విజయదశమి రోజున పాటల రికార్డింగ్ చేస్తామని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘శ్రీహరి మార్కు సినిమా ఇది. శివనాగు అద్భుతమైన స్క్రిప్టు అందించారు. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతాం. కళింగ అనే యువకుడు తన ఆశయాన్ని ఎలా నెరవేర్చుకున్నాడన్నది ఈ సినిమా ప్రధాన కథాంశం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వెంకట్, కెమెరా: కిషన్ సాగర్, సమర్పణ: డి. రామ్మూర్తి తేజ, సహనిర్మాత: టి. లక్ష్మణరావు.