వరల్డ్‌ రికార్డ్‌ టార్గెట్‌గా ‘నీకు... నాకు... రాసుంటే’ | Niku Naku Rasi Unte Movie Song Recording And Yashraj Entertainment Banner Launching | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ రికార్డ్‌ టార్గెట్‌గా ‘నీకు... నాకు... రాసుంటే’

Published Sat, Apr 16 2022 6:06 PM | Last Updated on Sat, Apr 16 2022 6:09 PM

Niku Naku Rasi Unte Movie Song Recording And Yashraj Entertainment Banner Launching - Sakshi

ఈశ్వర్, సాయివిక్రాంత్, రిషి, సూర్య ప్రధాన పాత్రల్లో..యష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై స్రవంతి పలగని, అభిషేక్‌ ఆవల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నీకు..నాకు..రాసుంటే’. కె.ఎస్‌. వర్మ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సాంగ్‌ రికార్డింగ్‌, బ్యానర్‌ లాంచింగ్‌ హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సందర్భంగా ప్రముఖ గాయని  సునీత మాట్లాడుతూ.. తెలుగులో యశ్‌రాజ్‌ పేరుతో బ్యానర్‌ స్థాపించడంతోనే సగం విజయం సాధించారు నిర్మాతలు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం దర్శకులు వర్మ గారే 24 క్రాఫ్ట్స్ చేస్తున్నారు. ఈ ప్రయోగం ఒక మంచి ప్రయోగంగా మిగిలి పోవాలి. యూనిట్‌ అందరికీ నా బెస్ట్‌ విషెస్‌. నేను లైవ్‌లో ఓ సినిమాకు పాట పాడటం ఇదే తొలిసారి. ఇది కూడా ఓ రికార్డ్‌ అనుకుంటా. నాకు ఈ ప్రయోగాత్మక చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

దర్శకుడు కె.ఎస్‌. వర్మ మాట్లాడుతూ..ప్రపంచ రికార్డు కోసం 24 క్రాఫ్ట్స్ ను నేనే నిర్వహిస్తున్నాను. దీన్ని లైవ్‌ రికార్డు కూడా చేస్తాం. తప్పకుండా మా కష్టానికి తగ్గట్టుగా ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను. మా సినిమాలో జాతీయ అవార్డు పొందిన ఓ ప్రముఖ హీరోయిన్‌ ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు.. ఇందుకు చర్చలు జరుగుతున్నాయి అన్నారు.  

నిర్మాతలు స్రవంతి పలగని, అభిషేక్‌ ఆవల మాట్లాడుతూ.. భారత దేశం గర్వించే సినిమాలు చేసిన యశ్‌రాజ్‌ ఫిలింస్‌ని దృష్టిలో పెట్టుకుని మా బ్యానర్‌కు ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ ఏడాది మూడు సినిమాలు నిర్మించాలనుకుంటున్నాం.. అన్ని సినిమాల్లో కొత్తవారికి అవకాశాలు ఇస్తాం. మే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి, హైదరాబాద్, అరకు, వైజాగ్, మంగళూరు, ఊటీ, చెన్నై తదితర లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతాం’అన్నారు.ఈ కార్యక్రమంలో హీరోలు  ఈశ్వర్, సాయివిక్రాంత్, రిషి, సూర్య  తదితరులు పాల్గొన్నారు. సత్యరాజ్, సుమన్, అలీ, రఘుబాబు, గౌతంరాజు, తనికెళ్ల భరణి, ఉత్తేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా సురేష్‌బాబు వ్యవహరిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement