
‘అహం బ్రహ్మాస్మి’లో మంచు మనోజ్
కరోనా పోరాటానికి స్ఫూర్తి నింపడానికి తమకు తోచిన విధంగా తమ స్టయిల్లో పాటలు విడుదల చేస్తున్నారు స్టార్స్. తాజాగా మంచు మనోజ్ కరోనాపై పోరాటం చేస్తున్న వారికి భరోసా ఇవ్వడానికి ఓ పాటను రికార్డ్ చేశారు. వచ్చే వారం ఈ పాట విడుదల కాబోతోంది. ఈ విషయం గురించి మనోజ్ మాట్లాడుతూ –‘మూడు సంవత్సరాల విరామం తర్వాత మంచి సినిమా (మనోజ్ హీరోగా ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమా పూజా కార్యక్రమాలు లాక్ డౌన్‌కి కొన్ని రోజుల ముందు జరిగాయి) తో మిమ్మల్ని పలకరిద్దాం అనుకున్నాను.
మనమంతా ఒక స్క్రిప్ట్ రాసుకుంటే దేవుడు మరొక స్క్రిప్ట్ రాస్తాడు. ‘యాక్షన్’ అన్న పదం వినే అదృష్టాన్ని ఇంకొన్ని రోజులు దూరం జరిపాడు. వచ్చే వారం డాక్టర్లకు, పోలీసులకు, ఆర్మీకి, పారిశుధ్య కార్మికులకు ముఖ్యంగా వాళ్ల త్యాగానికి ‘అంతా బాగుంటాం రా’ అనే పాటను అంకితం చేస్తున్నాను. సంగీత దర్శకుడు అచ్చు స్వరపరిచిన ఈ పాటను నేను, నా మేనకోడలు విద్యా నిర్వాణ (మంచు లక్ష్మి కుమార్తె) కలిసి పాడి, పాట రూపంలో ఇస్తున్న చిన్న భరోసా ఇది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment