
వింబుల్డన్ జూనియర్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ బాలుర సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ మానస్ ధామ్నే శుభారంభం చేశాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన మానస్ ఆదివారం లండన్‌లో జరిగిన తొలి రౌండ్‌లో 6–2, 6–4తో ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్‌లో 47వ స్థానంలో ఉన్న హేడెన్ జోన్స్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మానస్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు 14 విన్నర్స్ కొట్టి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు.
రన్నరప్ సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ25 మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి రన్నరప్‌గా నిలిచింది. థాయ్‌లాండ్‌లో జరిగిన సింగిల్స్ ఫైనల్లో సహజ 4–6, 0–6తో మన చాయ సావంగ్‌కెయి (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 65 నిమిషాలు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ ఒక ఏస్ సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది.
చదవండి: నాకు నమ్మకం ఉంది.. టీమిండియాను మా జట్టు ఓడిస్తుంది: బ్రియాన్ లారా
Comments
Please login to add a commentAdd a comment