ఏడేళ్ల బాలిక కిడ్నాప్..! | Seven-year -old girl kidnapped ..! | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల బాలిక కిడ్నాప్..!

Published Wed, Feb 17 2016 8:10 PM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

ఏడేళ్ల బాలిక కిడ్నాప్..!

ఏడేళ్ల బాలిక కిడ్నాప్..!

రాజమండ్రి: చాక్లెట్ కొనుక్కునేందుకని బయటకు వచ్చిన ఏడేళ్ల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండంలంలోని చదలవాడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు... ఏదో పెళ్లి విషయమై వీరవరం మండలం చెర్లంపూడి గ్రామానికి చెందిన పూజిత తల్లిదండ్రులతో కలసి అమ్మమ్మ గ్రామం చదలవాడకు వచ్చింది.

అయితే బుధవారం ఉదయం 11 గంటల సమయంలో చాక్లెట్ కొనుక్కొనేందుకు బయటకి వచ్చిన పూజిత అప్పట్నుంచి కనిపించడం లేదు. పూజిత తండ్రి వీరవరం మండల ఎమ్మార్వో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. బాలిక కిడ్నాప్ గురవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాప కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement