యూపీలో మరో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. కాంట్రాక్టర్ మన్నా సింగ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన పంకజ్ యాదవ్‌పై యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్‌టీఎఫ్) కాల్పులు జరిపింది. ఈ నేరస్తునిపై పై లక్ష రూపాయల రివార్డు ఉంది. ఈ ఎన్‌కౌంటర్‌లో పంకజ్ మృతిచెందాడు. కాగా బీఎస్‌పీ మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ, మాఫియా షహబుద్ధీన్‌లకు పంకజ్ యాదవ్‌లకు షూటర్‌గా పనిచేశాడు. అలాగే డబ్బుల కోసం హత్యలు చేసే కాంట్రాక్ట్ కిల్లర్‌గానూ పేరొందాడు.
ఈ ఘటన గురించి పోలీసులు మీడియాతో మాట్లాడుతూ మధుర-ఆగ్రా హైవేలోని ఫర్హా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున 4 గంటలకు ఎన్‌కౌంటర్ జరిగిందని ఎస్‌టీఎఫ్ తమకు తెలియజేసిందన్నారు. నేరస్తుడు పంకజ్ యాదవ్ తన సహచరులలోని ఒకరితో కలిసి బైక్‌పై ఆగ్రా వైపు వెళ్తున్నట్లు ఇన్‌ఫార్మర్ నుండి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌టీఎఫ్ బృందం అతనిని వెంబడించింది. ఆతను గ్రామం వైపు పరిగెడుతూ ఎస్‌టీఎఫ్ బృందంపై కాల్పులు ప్రారంభించాడు. దీనికి ప్రతిగా ఎస్‌టీఎఫ్ కూడా కాల్పులు జరిపింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పంకజ్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని సహచరుడు సంఘటనా స్థలం నుండి పారిపోయాడు. దీంతో ఎస్‌టీఎఫ్ బృందం అతని కోసం గాలిస్తోంది.
గాయపడిన పంకజ్‌ను మధుర జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి మృతిచెందినట్లు ప్రకటించారు. యూపీ ఎస్‌టీఎఫ్ బృందం సంఘటనా స్థలం నుండి ఒక పిస్టల్, ఒక రివాల్వర్, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుంది. పంకజ్ యాదవ్ మవులోని తాహిరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణిపూర్ గ్రామ నివాసి. మన్నా సింగ్ హత్యలో ప్రమేయమున్న పంకజ్ యాదవ్‌పై హత్య, దోపిడీ తదితర 36 కేసులు నమోదయ్యాయి. పంకజ్ యాదవ్‌ను అరెస్టు చేయడానికి యూపీ పోలీసులు, యూపీ ఎస్‌టీఎఫ్ సిబ్బంది చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment