న్యూఢిల్లీ: ఏపీ ఆర్థిక పరిస్థితిపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన మేరకే ఏపీకి అప్పులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే నెట్ బారోయింగ్ సీలింగ్ లిమిట్ ఫిక్స్ చేస్తారని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ కోసమే ఏపీఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అమల్లో ఉందన్నారు. స్టేట్ లెజిస్లేచర్ ఎఫ్‌ఆర్‌బీఎంను పర్యవేక్షిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment