
దోహా: తన కెరీర్‌లో 18వ ప్రపంచ టైటిల్ సాధించాలని ఆశించిన భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు పంకజ్ అద్వానీకి నిరాశ ఎదురైంది. ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ (లాంగ్ అప్ ఫార్మాట్)లో పంకజ్ పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది.
బుధవారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 620–1250 పాయింట్లతో మైక్ రసెల్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు. ఈ ఓటమితో పంకజ్‌కు కాంస్యం లభించింది. గతవారం ఇదే వేదికపై జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ (పాయింట్ల ఫార్మాట్) చాంపియన్‌షిప్‌లో పంకజ్ విజేతగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment