
ఇలా పనిచేస్తుంది..
ఆండ్రాయిడ్ ఫోన్‌లలో కాడ్రివియమ్ సాఫ్ట్‌వేర్ సంస్థ ద్వారా రూపొందించిన ప్రత్యేక జీపీఎస్ విధానాన్ని అప్‌లోడ్ చేస్తారు. ఈ సెల్‌ఫోన్లను ప్రతి స్టేషన్‌కు అందజేస్తారు.
ఆండ్రాయిడ్ ఫోన్‌లలో కాడ్రివియమ్ సాఫ్ట్‌వేర్ సంస్థ ద్వారా రూపొందించిన ప్రత్యేక జీపీఎస్ విధానాన్ని అప్‌లోడ్ చేస్తారు. ఈ సెల్‌ఫోన్లను ప్రతి స్టేషన్‌కు అందజేస్తారు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, ముఖ్యమైన స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇంకా ముఖ్యమైన వాటిని అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఇందులో నిక్షిప్తం చేస్తారు. రాత్రి సమయంలో విధులు నిర్వహించే బీట్ కానిస్టేబుళ్లకు ఈ ఫోన్‌లు ఇస్తారు. బీట్ కానిస్టేబుళ్లు విధులను ప్రారంభించగానే అధికారుల వద్ద గల యూజర్‌పాస్‌వర్డ్‌లతో జీపీఎస్ పనిచేయడం ప్రారంభమవుతుంది. కానిస్టేబుళ్లు తమకు కేటాయించిన విధులను పట్టణాల్లో, గ్రామాల్లో నిర్వహించే సమయంలో ప్రతి అడుగు ఇందులో రికార్డు అవుతుంది. ఎక్కడ ఉంది..ఎటు వెళ్తుంది.. సెంట్రల్ సిస్టంలో తెలిసిపోతుంది. ఒక వేల సిచ్చాఫ్ చేస్తే వెంటనే ఆ సమాచారం పై అధికారులకు తెలిసిపోతుంది. దీని ని ఎలక్ట్రానిక్ బీట్ సిస్టంగా నామకరణం చేశారు.
కంట్రోల్ సిస్టానికి అనుసంధానం
విధుల్లో ఉండే పోలీస్‌కు ఇచ్చిన ఫోన్‌లోని జీపీఎస్‌ను జిల్లా కేంద్రం, డివిజన్, సర్కిల్, స్థానిక పోలీస్‌స్టేషన్ అధికారి వద్ద ఉన్న కంట్రోల్ సిస్టానికి అనుసంధానమై ఉంటుంది. వెంటవెంటనే ఆయా సిస్టంలలో రికార్డు అవుతుంది.