
జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ, మౌని, మమతశ్రీ చౌదరి ప్రధానపాత్రల్లో మురళి రామస్మామి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సుమన్ కీలక పాత్రధారి. పి.ఎస్. రామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్టు పూర్తయింది. మురళి రామస్వామి మాట్లాడుతూ– ‘‘ఇది నా తొలి సినిమా. ఫ్రెష్ అండ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. సుమన్‌గారు బాగా సపోర్ట్ చేశారు. హీరోయిన్స్ కోసం 200 మందిని ఆడిషన్ చేశాం. జీపీఎస్ బాగా నటించాడు. టాకీ పార్ట్ పూర్తయింది. మిగిలిన ఒక పాటను త్వరలో చిత్రీకరిస్తాం. జూన్ లేదా జులైలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఇదో ట్రెండీ లవ్ స్టోరీ’’ అన్నారు రామకృష్ణ. ‘‘కథ చెప్పినప్పుడు ఇది సినిమానా లేక జీవితమా అనిపించింది. సుమన్‌గారితో నటించడం హ్యాపీ’’ అని జీపీఎస్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment