స్కూల్ పిల్లల కదలికల్ని పసిగట్టే యాప్‌! | Now, a new GPS enabled app for tracking your kids' whereabouts | Sakshi
Sakshi News home page

స్కూల్ పిల్లల కదలికల్ని పసిగట్టే యాప్‌!

Published Mon, Jun 20 2016 7:21 PM | Last Updated on Sat, Sep 15 2018 5:14 PM

స్కూల్‌కు వెళ్లే పిల్లల కదలికలను తల్లిదండ్రులు తెలుసుకునేందుకు జీపీఎస్‌ సాయంతో పనిచేసే యాప్‌ను ఓ స్టార్టప్‌ కంపెనీ రూపొందించింది.

తిరువనంతపురం: స్కూల్‌కు వెళ్లే పిల్లల కదలికలను తల్లిదండ్రులు తెలుసుకునేందుకు జీపీఎస్‌ సాయంతో పనిచేసే యాప్‌ను ఓ స్టార్టప్‌ కంపెనీ రూపొందించింది. కొచ్చిలోని కలమసెర్రీ రాజగిరి పబ్లిక్‌ స్కూల్‌లో దీనిని ప్రారంభించారు. ప్రతి విద్యార్థికి ఒక స్మార్ట్‌ గుర్తింపు కార్డు ఇచ్చి, దానిని జీపీఎస్‌/జీఎన్‌ఎస్‌ఎస్‌ ట్రాన్‌సైట్‌ నమూనాలో ప్రీక్వెన్సీ కార్డు రీడర్‌కు అనుసంధానిస్తారు.

ఆ తర్వాత స్కూలుతోపాటు బస్సుల్లో వీటిని అమరుస్తారు. అన్ని డివైస్‌లను ట్రాన్‌సైడ్‌ క్లౌడ్‌ ఖాతాకు కనెక్ట్‌ చేస్తారు. ప్రతి తల్లిదండ్రులు తమ సొంత ఖాతాను ఈ క్లౌడ్‌కు అనుసంధానించి తమ స్మార్ట్‌ ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకోవడం ద్వారా పిల్లల కదలికలను తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ యాప్‌ను ట్రాన్‌సైట్‌ సిస్టం ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ రూపొందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement