పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించుకున్న నేవిగేషన్ శాటిలైట్ సిస్టం గురించి మీకు తెలియని విషయాలు ఇవే. మన నేవిగేషన్ వ్యవస్థకు ఇప్పటి వరకూ విదేశీ శాటిలైట్ల సహకారాన్ని తీసుకుంటున్నాం. మనం సొంతంగా రూపొందించుకున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ శాటిలైట్ అందుబాటులోకి వస్తే.. మనకూ సొంత నేవిగేషన్ శాటిలైట్ అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది.
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ శాటిలైట్ గురించి
- ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ శాటిలైట్ వల్ల.. ప్రజలకు కచ్చితమైన రియల్ టైమ్ నేవిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.
- ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్న ప్రాంతీయ నేవిగేషన్ వ్యవస్థ.
- రెండు రకాల సేవలను ఈ శాటిలైట్ ప్రజలకు అందిస్తుంది. మొదటిది.. స్టాండర్డ్ పొజిషన్ సేవలను అందురూ వినియోగించుకోవచ్చు.. కొన్ని సేవలను కేవలం మిలటరీ, బద్రతా ఏజెన్సీలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
- ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రధానంగా 6 రకాల సేవలను అందిస్తుంది. అందులో భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సిస్టం. డిజాస్టర్ మేనేజ్‌మెంట, వెహికల్ ట్రాకింగ్ సిస్టం ప్రధానమైనవి.
- అమెరికన్ జీపీఎస్ సిస్టమ్‌లో ఒక ఆర్బిట్ఘలో 24 ఉపగ్రహాలు భూమికి సామాచారాన్ని అందిస్తాయి. అదే ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ విషయానికి వస్తే.. ఆర్బిట్ నాలుగు శాటిలైట్లు నిరంతరం భూమికి సమచారాన్ని అందిస్తాయి. అంతేకాక ఒక్కో శాటిలైట్.. తానున్న రీజియన్‌లో 1500 కిలోమీటర్ల ప్రాంతాన్ని స్కాన్ చేయగలదు.
- కచ్చితమైన కాలమానాన్ని ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ అందిస్తుంది.