IRNSS
-
విజయవంతంగా నింగిలోకి..
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ నేవిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి గురువారం తెల్లవారుజామున 4.04 గంటలకు పీఎస్ఎల్వీ–సీ41 వాహకనౌక ద్వారా 1425 కేజీలున్న ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. అమెరికాకు చెందిన జీపీఎస్, రష్యాకు చెందిన గ్లోనాస్, యూరప్‌కు చెందిన గెలీలియో తరహాలో భారత్‌లో పౌర, సైనిక అవసరాలకు నావిక్(దీన్ని ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్గానూ వ్యవహరిస్తున్నారు) అనే దేశీయ దిక్సూచీ వ్యవస్థను ఇస్రో అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా ఏడు ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. నావిక్ దిక్సూచీ వ్యవస్థ పనిచేయాలంటే కనీసం ఏడు ఉపగ్రహాలు అవసరమవుతాయి. అయితే ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఏ ఉపగ్రహంలోని రుబీడియమ్ అణు గడియారాలు పనిచేయకపోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా గతేడాది ఆగస్టులో ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్‌ను ఇస్రో ప్రయోగించింది. కానీ ఆ ఉపగ్రహానికున్న షీట్షీల్డ్ తెరుచుకోకపోవడంతో ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇస్రో తాజాగా ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని భూ బదిలీ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ప్రయోగం అనంతరం హసన్‌లోని మాస్టర్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు ఉపగ్రహం నియంత్రణను తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం 284 కి.మీ పెరిజీ(భూమికి దగ్గరగా), 20,650 కి.మీ అపోజీ(భూమికి దూరంగా) ఎత్తులో భూబదిలీ కక్ష్యలో ఉన్న ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహంలోని ఇంధనాన్ని దశలవారీగా మండించి 36,000 కి.మీ ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు. పదేళ్ల పాటు సేవలు బెంగళూరుకు చెందిన ప్రైవేటు సంస్థ ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్, ఇస్రోలు సంయుక్తంగా ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని నిర్మించాయి. ఈ ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. ఇస్రో అభివృద్ధి చేసిన నావిక్ దిక్సూచీ వ్యవస్థ సాయంతో దేశమంతటా వాహనాలు, నౌకలు, విమానాలకు దిశానిర్దేశం చేయవచ్చు. అంతేకాకుండా ఈ వ్యవస్థను సైనిక అవసరాలకూ వాడుకోవచ్చు. ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్, 1ఐ ఉపగ్రహాలను ఇస్రో ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ అనే ప్రైవేటు సంస్థతో కలసి నిర్మించింది. ఇస్రో ఇప్పటివరకూ 43 సార్లు పీఎస్ఎల్వీ వాహకనౌకలను ప్రయోగించగా.. అందులో 41 సార్లు విజయం సాధించింది. శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందనలు ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. నావిక్ దిక్సూచీ వ్యవస్థతో దేశంలోని సామాన్యులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. నావిక్ వ్యవస్థతో సరికొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయని ఇస్రో చైర్మన్ కె.శివన్ మీడియాకు తెలిపారు. దీనివల్ల దేశవ్యాప్తంగా తీరప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. త్వరలోనే నావిక్ ఆధారిత యాప్‌లను విడుదల చేస్తామనీ, దీన్ని పరిశ్రమలు, విద్యాసంస్థలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ ఏడాది ఇస్రో చరిత్రలోనే అత్యంత భారీ ఉపగ్రహమైన జీశాట్–11 (5,725 కేజీలు)ను ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రధానంగా భారీ ప్రయోగాలపైనే దృష్టి సారించినట్లు శివన్ చెప్పారు. రాకెట్ బరువు : 321 టన్నులు ఎత్తు : 44.4 మీటర్లు దశలు : 4 (ఘన, ద్రవ) ఉపగ్రహంబరువు : 1,425 కేజీలు పరిమాణం : 1.58 మీటర్లు గీ 1.5 మీటర్లు గీ 1.5 మీటర్లు సామర్థ్యం : 1,670 వాట్లు -
శ్రీహరికోటకు ఐఆర్ఎన్ఎస్ఎస్-1 ఉపగ్రహం
సాక్షి, నెల్లూరు : ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-1 (ఐఆర్ఎన్ఎస్ఎస్-1) ఉపగ్రహాన్ని జిల్లాలోని శ్రీహరికోటకు తరలించారు. శుక్రవారం ఉదయం భారీ భద్రత మద్య ఐఆర్ఎన్ఎస్ఎస్-1 ఉపగ్రహాన్ని బెంగళూరు నుంచి షార్ కేంద్రానికి తరలించారు. వచ్చే నెల 12న పీఎస్ఎల్వీ సీ-41 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. -
ఐఆర్ఎన్ఎస్ఎస్ గురించి మీకు తెలుసా?
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించుకున్న నేవిగేషన్ శాటిలైట్ సిస్టం గురించి మీకు తెలియని విషయాలు ఇవే. మన నేవిగేషన్ వ్యవస్థకు ఇప్పటి వరకూ విదేశీ శాటిలైట్ల సహకారాన్ని తీసుకుంటున్నాం. మనం సొంతంగా రూపొందించుకున్న ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్ అందుబాటులోకి వస్తే.. మనకూ సొంత నేవిగేషన్ శాటిలైట్ అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్ గురించి ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్ వల్ల.. ప్రజలకు కచ్చితమైన రియల్ టైమ్ నేవిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్న ప్రాంతీయ నేవిగేషన్ వ్యవస్థ. రెండు రకాల సేవలను ఈ శాటిలైట్ ప్రజలకు అందిస్తుంది. మొదటిది.. స్టాండర్డ్ పొజిషన్ సేవలను అందురూ వినియోగించుకోవచ్చు.. కొన్ని సేవలను కేవలం మిలటరీ, బద్రతా ఏజెన్సీలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఐఆర్ఎన్ఎస్ఎస్ ప్రధానంగా 6 రకాల సేవలను అందిస్తుంది. అందులో భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సిస్టం. డిజాస్టర్ మేనేజ్మెంట, వెహికల్ ట్రాకింగ్ సిస్టం ప్రధానమైనవి. అమెరికన్ జీపీఎస్ సిస్టమ్‌లో ఒక ఆర్బిట్ఘలో 24 ఉపగ్రహాలు భూమికి సామాచారాన్ని అందిస్తాయి. అదే ఐఆర్ఎన్ఎస్ఎస్ విషయానికి వస్తే.. ఆర్బిట్ నాలుగు శాటిలైట్లు నిరంతరం భూమికి సమచారాన్ని అందిస్తాయి. అంతేకాక ఒక్కో శాటిలైట్.. తానున్న రీజియన్‌లో 1500 కిలోమీటర్ల ప్రాంతాన్ని స్కాన్ చేయగలదు. కచ్చితమైన కాలమానాన్ని ఐఆర్ఎన్ఎస్ఎస్ అందిస్తుంది. -
భారత జాతీయ జెండా విశ్వకేతనం ఘనత ఇస్రోదే
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థ (ఐఆర్ఎన్ఎస్ఎస్) సిరీస్‌లో ఏడో నావిగేషన్ ఉపగ్రహాన్ని గురువారం విజయవంతంగా ప్రయోగించి అంతరిక్ష విజయాల వినువీధిలో భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని విశ్వకేతనం చేసిన ఘనత ఇస్రో శాస్త్రవేత్తలకే దక్కిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రయోగించి పీఎస్ఎల్వీ సీ33 ప్రయోగాన్ని ఆయన న్యూఢిల్లీ నుంచి తిలకించారు. వాస్తవంగా ప్రయోగాన్ని స్వయంగా వీక్షించి, నావిగేషన్ సిస్టంను జాతికి అంకింతం చేయడానికి విచ్చేస్తారని ప్రచారం జరిగింది. ఆయన రాలేకపోవడంతో ప్రయోగం విజయవంతం కాగానే న్యూఢిల్లీ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇది ఇస్రో చేసిన ప్రయోగాల్లో చరిత్రాత్మకమై ఘట్టమని, దీన్ని యజ్ఞంలా తీసుకుని ఏడు నావిగేషన్ ఉపగ్రహాలను వరుసగా దిగ్విజయంగా ప్రయోగించినందుకు అందరికీ అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉపగ్రహ ప్రయోగాలతో సాంకేతిక విప్లవం వచ్చిందని, వాటి ఫలితాలు సామాన్యుడికి సైతం అందుతున్నాయన్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఐదు దేశాలకు మాత్రం వివిధ రకాల పేర్లుతో నావిగేషన్ సిస్టం ఉందని, పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నావిగేషన్ సిస్టం అభివృద్ధి చేసుకున్న ఆరో దేశంగా నేడు భారత్ అవిర్భవించిందని చెప్పారు. నావిగేషన్ సిస్టం అంటే నేడు సామాన్య మానవుడికే కాకుండా సముద్రంలో చేపలు పట్టుకునే మత్స్యకారులు నుంచి విమానాలు, నౌకలు నడిపే పైలైట్లు, కెప్టెన్ వరకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అవి ఎక్కడ జరిగాయో గుర్తించి వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా ఇది దోహదపడుతుందని వివరించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి ప్రమాదాలు జరిగినా, ఇతరత్రా ఉపద్రవాలు జరిగినా గుర్తించి సమాచారం అందిస్తుందన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా సముద్రంలో తిరిగే ఓడలకు దిశా నిర్దేశాన్ని అందజేస్తుందన్నారు. భూమిమీద తిరిగే వాహనాలు, రైళ్లు, ఆకాశంలో తిరిగే విమానాలకు, నీటిపై తిరిగే ఓడలకు దిక్సూచి వ్యవస్థను అందించడమే కాకుండా సామాన్య మానవుడు వాడుకునే ఆండ్రాయిడ్ ఫోన్లలో నావిగేషన్ సిస్టంను అందిస్తుందని చెప్పారు. మరో రెండు, మూడు నెలల్లో ప్రతి ఒక్కరి చేతిలో నావిగేషన్ సిస్టం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సాంకేతిక ఫలితాలు పేదా గొప్ప తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అందజేయాలనే భారత ప్రభుత్వం లక్ష్యం నేరవేరుతోందని అన్నారు. అందుకే దీన్ని జాతికి అంకింతం చేస్తున్నామని మోదీ చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలు పదేళ్లు శ్రమించి నావిగేషన్ సిస్టంను తయారు చేసినందుకు వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. -
షార్కు చేరుకున్న ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ
సూళ్లూరుపేట: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రమోగ కేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 28న ప్రయోగించ తలపెట్టిన ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ) ఉపగ్రహం బెంగళూరు నుంచి సోమవారం శ్రీహరికోటకు చేరింది. పీఎస్ఎల్వీ సీ33 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిం చనున్నారు. 1425 కిలోల బరువు ఉన్న ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రం(ఐసాక్) నుంచి ఆదివారం తరలించి చెన్నై మీదుగా భారీ బందోబస్తు మధ్య సోమవారం శ్రీహరికోటకు తీసుకొచ్చారు. ఉపగ్రహానికి అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత ద్రవ ఇంధనాన్ని నింపి రాకెట్ శిఖర భాగాన అమర్చే ప్రక్రియను చేపడతారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై పీఎస్ఎల్వీ సీ33 నాలుగు దశల రాకెట్ అనుసంధానం పనులను పూర్తిచేసి ఉపగ్రహాన్ని అమర్చనున్నారు. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థలో ఇది ఆఖరు ఉపగ్రహం. ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని పూర్తిచేస్తే భారతదేశానికి సొంత నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రయోగాన్ని వీక్షించి, నావిగేషన్ సిస్టంను జాతికి అంకితం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షార్కు విచ్చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. -
దిక్సూచిలో మూడో అడుగు... పీఎస్ఎల్వీ-సీ26
పూర్తి స్థాయి స్వతంత్ర నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ సాధనలో భారత్ మరో ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన.. పీఎస్ఎల్వీ-సీ 26 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్,26) ప్రయోగం విజయవంతమైంది. 1,425 కిలోల బరువు గల ఇండియన్ రీజియనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-1సి (ఐఖూ1ఇ) ఉపగ్రహన్ని నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ 26 రాకెట్ సాయంతో ఇస్రో నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ప్రాంతీయ దిక్సూచి శాటిలైట్ వ్యవస్థ: ప్రాంతీయ దిక్సూచి శాటిలైట్ వ్యవస్థ కలను సాకారం చేసేందుకు ఉద్దేశించింది.. ఐఆర్ఎన్ఎస్ఎస్. దీనిలో మొత్తం 7 ఉపగ్రహాలు ఉంటాయి. ఇస్రో ఇప్పటివరకు మూడు ఉపగ్రహాలను ప్రయోగించింది. వీటిలో ఐఆర్ఎన్ఎస్ఎస్-1సి మూడోది. దీన్ని 67 గంటల కౌంట్‌డౌన్ అనంతరం అక్టోబరు 16న అర్ధరాత్రి దాటాక గం. 1.32 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ 26 ప్రయోగించారు. లిఫ్ట్ ఆఫ్ సమయంలో పీఎస్ఎల్వీ-సీ26 బరువు సుమారు 320 టన్నులు. లిఫ్ట్ ఆఫ్ జరిగిన 20.18 నిమిషాల అనంతరం ఐఆర్ఎన్ఎస్ఎస్-1సి ఉపగ్రహాన్ని 282.56 కిలోమీటర్ల పెరెజీ ఁ 20,670 కిలో మీటర్ల అపోజీ ఉన్న భూ స్థిర కక్ష్యలోకి పీఎస్ఎల్వీ-సీ 26 రాకెట్ ప్రవేశపెట్టింది. అర్ధరాత్రి రాకెట్ ప్రయోగం నిర్వహించడం ఇది రెండోసారి. ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎ ఉపగ్రహాన్ని ఇదే విధంగా 2013, జూలై 1న ఇస్రో పీఎస్ఎల్వీ-సీ22 ద్వారా ప్రయోగించింది. ఈ విధంగా ఇప్పటివరకు మూడు ఉపగ్రహాల(ఐఆర్ఎన్ఎస్ఎస్ -1ఎ, 1బి, 1సి)ను ఇస్రో నావిగేషన్ వ్యవస్థలో భాగంగా ప్రయోగించింది. భారత్‌కు చెందిన ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థలో మొత్తం ఏడు ఉపగ్రహాలు ఉంటాయి. భవిష్యత్‌లో మరో నాలుగు ఉపగ్రహాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది. భారత ప్రధాన భూభాగంతో పాటు, ప్రధాన భూభాగం సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల పరిధి వరకు దీని కవరేజీ ఉంటుంది. 2015-16 నాటికి ఈ వ్యవస్థను పూర్తిచేయాలని ఇస్రో భావిస్తోంది. జీపీఎస్ ఆవిర్భావం వెనుక: దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ ఉపగ్రహాలతో పలు ప్రయోజనాలు ఉన్నాయి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను తొలిసారిగా 1973లో అమెరికా రక్షణ విభాగం అభివృద్ధి చేసింది. ఉపగ్రహం ఆధారంగా సైనికులు, రవాణా వాహనాలు, యుద్ధ విమానాలు, నౌకల దిశా నిర్దేశం కోసం ప్రారంభంలో జీపీఎస్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత వాణిజ్య, సాంకేతిక అనువర్తనాలకు దీన్ని విస్తరించారు. ఈ రాకెట్ ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌నే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) అని పిలుస్తారు. రవాణా రంగంలో సాధారణ వ్యక్తులు తమ గమ్యాన్ని చేరాల్సిన చోటును తెలుసుకోవడం, లక్ష్యం ఎంత దూరంలో ఉందో గుర్తించడంలో ఈ వ్యవస్థ ఉపకరిస్తుంది. మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న పర్యావరణ పరిశోధన కేంద్రాలను అనుసంధానించడానికి ఇది దోహదపడుతుంది. పర్వతారోహకులకు, ఓడల గమనానికి దిశా నిర్దేశం చేస్తుంది. ఐదో దేశం భారత్: ఐఆర్ఎన్ఎస్ఎస్ (ఐఖూ) ద్వారా బహిరంగ వాణిజ్యం, కమ్యూనికేషన్ సేవలు మరింత మెరుగవుతాయి. ఈ రకమైన సేవలకు ఉపగ్రహాలపై కంటే దేశీయ నావిగేషన్‌పై ఆధారపడటం మంచిది. పూర్తి భద్రతతో కూడిన సైనిక కార్యకలాపాలను నిర్వహించడానికి ఐఆర్ఎన్ఎస్ఎస్ ఎంతగానో ఉపకరిస్తుంది. ఇప్పటికే రష్యా గ్లోనాస్ (ఎఔైూఅ, గ్లోబల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్), ఐరోపా-గెలీలియో, చైనా-బెయ్‌డోవ్ (ఆజ్ఛీఈౌఠ), జపాన్-క్వాసీజెనిథ్ (ఖఠ్చటజీో్ఛజ్టీజి), వంటి నావిగేషన్ వ్యవస్థలను అభివృద్ధి చేసుకుంటున్నాయి. కాగా ఈ పరిజ్ఞానం సమకూర్చుకున్న ఐదో దేశంగా భారత్ ఘనత సాధించింది. మూడోది: ఐఆర్ఎన్ఎస్ఎస్-1సి.. దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థలో మూడోది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎని పీఎస్ఎల్వీ-సీ22 ద్వారా 2013 జూలై, ఐఆర్ఎన్ఎస్ఎస్ -1బి ను, పీఎస్ఎల్వీ-సీ 24 ద్వారా 2014 ఏప్రిల్‌లో ఇస్రో ఇప్పటికే ప్రయోగించింది. ఇప్పుడు ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1సి దాదాపు వాటినే పోలి ఉంటుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1సి బరువు 1425 కిలోలు. దాదాపు పదేళ్ల పాటు ఇది సేవలను అందిస్తుంది. దీంట్లో రెండు రకాల పేలోడ్లు ఉంటాయి. ఒకటి నావిగేషన్ పేలోడ్. రెండోది రేంజింగ్ పేలోడ్. వినియోగదారులకు నావిగేషన్ సంకేతాలను అందించడంలో నావిగేషన్ పేలోడ్ ఉపయోగపడుతుంది. ఔ-5, -బ్యాండ్లలో ఇది పని చేస్తుంది. పూర్తిస్థాయి నిర్ధిష్టతతో కూడిన రుబీడియం అణు గడియారం (అటామిక్ క్లాక్) ఇందులో ఉంటుంది. ఉపగ్రహం పరిధిని నిర్దేశించే ది ఇ-బ్యాండ్. ఇది ట్రాన్స్ఫార్మర్ రేంజింగ్ పేలోడ్‌లో ఉంటుంది. లేజర్ రేంజింగ్‌కు ఉద్దేశించిన కార్నర్ క్యూబ్ రెట్రో రిఫ్లెక్టర్స్ కూడా ఐఆర్ఎన్ఎస్ఎస్-1సిలో ఉన్నాయి. పీఎస్ఎల్వీ: ఇస్రో ప్రయోగించిన 28వ పీఎస్ఎల్వీ ప్రయోగం, పీఎస్ఎల్వీ-సీ 26. ఇది ఇస్రో సాధించిన 27వ వరుస పీఎస్ఎల్వీ ప్రయోగ విజయం. దీన్ని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్ఎల్వీ -ఎక్స్ఎల్ రూపంలో ప్రయోగించారు. ఈ క్రమంలో స్ట్రాప్ ఆన్ మోటార్ల పరిమాణాన్ని పెంచుతారు. ఇలాంటి తరహాలో పీఎస్ఎల్వీని ప్రయోగించడం ఇది ఏడో సారి. ప్రయోగాలు: ఇదివరకటి పీఎస్ఎల్వీ -ఎక్స్ఎల్ ప్రయోగాల వివరాలు ఇలా ఉన్నాయి. వాటిలో పీఎస్ఎల్వీ-సీ11 / చంద్రయాన్-1, పీఎస్ఎల్వీ-సీ17/ జీశాట్-12, పీఎస్ఎల్వీ-సీ19 / రీశాట్-1, పీఎస్ఎల్వీ-సీ 22/ ఐఆర్ఎన్ఎస్ఎస్-1సి-1ఎ, పీఎస్ఎల్వీ-సీ25 / మంగళ్యాన్, పీఎస్ఎల్వీ-సీ24 / ఐఆర్ఎన్ఎస్ఎస్-1బి. అరుదైన వాహక నౌక... పీఎస్ఎల్వీ: ప్రపంచ వ్యాప్తంగా భారత అంతరిక్ష కార్యక్రమం ఘనత చాటడంలో పీఎస్ఎల్వీ కీలకమైంది. పీఎస్ఎల్వీ కార్యక్రమం 1982లో ప్రారంభమైంది. అప్పటికీ ఇస్రో ఎస్ఎల్వీ-3, ఏఎస్ఎల్వీ అనే రెండు పరిశోధన నౌకలను విజయ వంతంగా అభివృద్ధి చేసింది. పీఎస్ఎల్వీ నమూనా పొడవు 44.4 మీటర్లు. బరువు 294 టన్నులు. ధ్రువ కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి దీన్ని తొలుత రూపొందించారు. భూస్థిర, భూ అనువర్తిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ఇది ప్రయోగించగలదు. ఇది నాలుగు దశల నౌక. మొదటి, మూడో దశలలో ఘన ఇంధనం, రెండు, నాలుగో దశలో ద్రవ ఇంధనాన్ని నింపుతారు. ఇది మూడు రకాలుగా ఉంటుంది. పీఎస్ఎల్వీ జనరిక్ రూపంలో మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉంచారు. పీఎస్ఎల్వీ -కోర్ అలోన్ రూపంలో స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉండవు. పీఎస్ఎల్వీ -ఎక్స్ఎల్ రూపంలో ఈ స్ట్రాప్ ఆన్ మోటార్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. విజయ పరంపర: ప్రపంచంలోని పూర్తి విజయవంతమైన అతికొద్ది రాకెట్లలో పీఎస్ఎల్వీ ఒకటి. అనేక దేశాలు దీని ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటివరకు చేపట్టిన 28 పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో మొదటి మూడు అభివృద్ధి ప్రయోగాలు. మిగతా 25 కార్యాచరణ ప్రయోగాలు. 1993, సెప్టెంబర్ 20న చేపట్టిన మొదటి పీఎస్ఎల్వీ అభివృద్ధి ప్రయోగం మాత్రమే విఫలమైంది. ఆ తర్వాత నిర్వహించిన 27 ప్రయోగాలు వరుసగా విజయవంతమయ్యాయి. ఇప్పటి వరకు పీఎస్ఎల్వీ ద్వారా ఇస్రో 71 ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. వీటిలో 31 స్వదేశీ, 40 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. పీఎస్ఎల్వీ ప్రయోగాలు పీఎస్ఎల్వీ {పయోగతేదీ {పయోగించిన ఉపగ్రహాలు పీఎస్ఎల్వీ-డీ1 సెప్టెంబర్ 20, 1993 ఐఆర్ఎస్-1ఈ ప్రయోగం విఫలం పీఎస్ఎల్వీ-డీ2 అక్టోబర్ 15, 1994 ఐఆర్ఎస్-పీ2 పీఎస్ఎల్వీ-డీ3 మార్చి 21, 1996 ఐఆర్ఎస్-పీ3 పీఎస్ఎల్వీ-సీ1 సెప్టెంబర్ 29, 1997 ఐఆర్ఎస్ - 1డీ పీఎస్ఎల్వీ-సీ2 మే 26, 1999 ఐఆర్ఎస్ -పీ4 (ఓషన్ శాట్-1)+కిట్‌శాట్-3 (కొరియా) డీఎల్ఆర్-ట్యూబ్‌శాట్ (జర్మనీ) పీఎస్ఎల్వీ-సీ3 అక్టోబర్ 22, 2001 టెక్నాలజీ ఎక్స్పెరిమెంట్ శాటిలైట్, బర్డ(జర్మనీ),ప్రోబా(బెల్జియం) పీఎస్ఎల్వీ-సీ4 సెప్టెంబర్ 12, 2002 కల్పన-1 పీఎస్ఎల్వీ-సీ5 అక్టోబర్ 17, 2003 ఐఆర్ఎస్-పీ6 (రిసోర్‌సశాట్-1) పీఎస్ఎల్వీ-సీ6 మే 5, 2005 కార్టోశాట్-1, హామ్‌శాట్ (ఏ్చఝట్చ్ట) పీఎస్ఎల్వీ-సీ7 జనవరి 10, 2007 కార్టోశాట్-2, ఎస్ఆర్ఈ-1, లాపాన్ ట్యూబ్‌శాట్ (ఇండోనేసియా) పేహున్‌శాట్ (అర్జెంటీనా) పీఎస్ఎల్వీ-సీ8 ఏప్రిల్ 23, 2007 ఎజైల్ (ఇటలీ), అడ్వాన్సడ్ ఏవియోనిక్స్ మాడ్యూల్ (ఏఏఎం) పీఎస్ఎల్వీ-సీ10 జనవరి 21, 2008 టెక్సార్ (ఇజ్రాయెల్) పీఎస్ఎల్వీ-సీ9 ఏప్రిల్ 28, 2008 కార్టోశాట్-2ఎ, ఇండియన్ మినీ శాటిలైట్-1 (ఐఎంఎస్-1)+ ఎనిమిది ఇతర దేశాల ఉపగ్రహాలు పీఎస్ఎల్వీ- సీ11 అక్టోబర్ 22, 2008 చంద్రయాన్-1 పీఎస్ఎల్వీ-సీ12 ఏప్రిల్ 20, 2009 రీశాట్-2+అనుశాట్ పీఎస్ఎల్వీ-సీ14 సెప్టెంబర్ 23, 2009 ఓషన్ శాట్-2+ ఆరు విదేశీ ఉపగ్రహాలు పీఎస్ఎల్వీ-సీ15 జూలై 12, 2010 కార్టోశాట్-2బి+స్టడ్‌శాట్+అల్‌శాట్ (అల్జీరియా)+ రెండు విదేశీ నానోశాట్+ఒక పికోశాట్ పీఎస్ఎల్వీ-సీ16 ఏపిల్ ్ర20, 2011 రిసోర్స్ శాట్-2+యూత్ శాట్+ఎక్స్‌శాట్ (సింగపూర్) పీఎస్ఎల్వీ-సీ17 జూలై 15, 2011 జీశాట్12 పీఎస్ఎల్వీ-సీ18 అక్టోబర్ 12, 2011 మేఘట్రాపిక్స్+ఎస్‌ఆర్‌ఎంశాట్+జుగ్ను+వెస్సెల్‌శాట్ (లక్సెంబర్గ్) పీఎస్ఎల్వీ-సీ19 ఏప్రిల్ 26, 2012 రీశాట్-1 పీఎస్ఎల్వీ-సీ20 ఫిబ్రవరి 25, 2013 సరళ్+ఆరు ఇతర విదేశీ ఉపగ్రహాలు పీఎస్ఎల్వీ-సీ21 సెప్టెంబర్ 9, 2012 స్పాట్-6 (ఫ్రాన్స్)+ప్రొయిటెరిస్ (జపాన్) పీఎస్ఎల్వీ-సీ22 జూలై 1, 2013 ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎ పీఎస్ఎల్వీ-సీ25 నవంబర్ 5, 2013 మంగళ్యాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్-మామ్) పీఎస్ఎల్వీ-సీ24 ఏప్రిల్ 4, 2014 ఐఆర్ఎన్ఎస్ఎస్-1బి పీఎస్ఎల్వీ-సీ23 జూన్ 30, 2014 స్పాట్-7 (ఫ్రాన్స్)+ ఎన్ఎల్ఎస్-71,ఎన్ఎల్ఎస్-72 (కెనడా)+ ఏఐ శాట్ (జర్మనీ)+ వెలాక్స్-1 (సింగపూర్) పీఎస్ఎల్వీ-సీ26 అక్టోబరు 16,2014 ఐఆర్ఎన్ఎస్ఎస్-1సి