జీపీఎస్ ఆధారిత డ్రోన్స్‌పై దృష్టి
జీపీఎస్ ఆధారిత డ్రోన్స్‌పై దృష్టి
Published Tue, Oct 4 2016 10:27 PM | Last Updated on Fri, May 25 2018 1:14 PM
- పుల్లారెడ్డి కాలేజీ ఈసీఈ విభాగాధిపతి
- ముగిసిన వర్క్‌షాప్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : రాబోయే రోజుల్లో గ్లోబల్ పోజిషన్ సిస్టమ్(జీపీఎస్) ఆ«ధారిత డ్రోన్స్‌ను తయారు చేస్తామని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ సురేష్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం నాన్ జీపీఎస్ ఆధారిత డ్రోన్స్, రోటర్స్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా వినియోగిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో డ్రోన్స్ సేవలను భారత సైన్యం వినియోగించే అవకాశం ఉందన్నారు. కళాశాలలో టెక్నికల్ జిజ్ఞాసా–2016 జాతీయ వర్కుషాపు రెండో రోజు కొనసాగింది. ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో 108 కళాశాలల విద్యార్థులు సొంతంగా డ్రోన్స్ తయారు చేసి గాల్లో ఎగుర వేశారు. ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో మ్యాట్‌ల్యాబ్ వర్కుషాపు నిర్వహించగా..50 కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారని హెచ్‌ఓడీ బ్రహ్మానందరెడ్డి తెలియజేశారు. మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో వాటర్ రాకెట్‌ను తయారు చేసి విద్యార్థులు ప్రయోగించారు. సివిల్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో టోటల్ స్టేషన్ అనే అంశంపై వర్కుషాపు నిర్వహించారు. కంప్యూటర్ విభాగం ఆధ్వర్యంలో ఎన్‌ఎస్=2 నెట్‌వర్కు సిములేటర్–2 అనే అంశంపై వర్కషాపు జరిగినట్లు విభాగాధిపతి డాక్టర్ కాశీవిశ్వనాథ్ తెలిపారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బాలాజీ ప్రశాంస పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, జిజ్ఙాసా–2016 కన్వీనర్ డాక్టర్ పీ.అబ్దుల్ ఖయూమ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement