దందా కోసం దందా! | Competition between two TDP leaders in Panyam | Sakshi
Sakshi News home page

దందా కోసం దందా!

Published Sun, Nov 3 2024 5:48 AM | Last Updated on Sun, Nov 3 2024 5:48 AM

Competition between two TDP leaders in Panyam

నంద్యాల జిల్లా పాణ్యంలో ఇద్దరు టీడీపీ నేతల మధ్య పోటీ 

ఓ నాయకుడికి డబ్బులిస్తున్నారని మరో నాయకుడి వర్గం ఆగ్రహం 

వాళ్లకు డబ్బెందుకిస్తున్నారని మైనింగ్‌ వ్యాపారిని నిలదీసిన టీడీపీ నేత 

ఇద్దరి మధ్య ఫోన్‌ సంభాషణ వైరల్‌ 

పాణ్యం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  ప్రతి రంగంలోనూ పలువురు ప్రజాప్రతినిధులు, నేతల దందాలు విపరీతంగా పెరిగిపోయాయి. వారు అడిగినంత ముట్ట చెప్పాలని, లేదంటే వ్యాపారాలే విడిచి పెట్టి వెళ్లిపోవాల్సిందే అన్నట్లుగా మారిపోయింది. మద్యం, ఇసుక, మైనింగ్‌ ఇలా ప్రతి రంగంలో అందిన కాడికి దోచుసుకొంటున్నారు. అడ్డొచి్చన వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. ఈ దందాలో టీడీపీ నేతల మధ్యే పోటీ నడుస్తోంది. 

ఒక నేతకు డబ్బులిస్తే మాకెందుకివ్వరంటూ మరో నేత వర్గీయులు వ్యాపారులను నిలదీస్తున్నారు. చివరకు ఈ దందా ఘర్షణలకూ దారి తీస్తోంది. వీటిని టీడీపీకి చెందిన వ్యాపారులే భరించలేక బయట పెట్టేస్తున్నారు. ఇలాంటి ఘటనే నంద్యాల జిల్లా పాణ్యంలో జరిగింది. అధికారి పార్టీ ఎమ్మెల్యేకు మైనింగ్‌ నిర్వాహకులు ఇచ్చిన వాటాలను సాక్షాత్తూ టీడీపీ నాయకులే బట్టబయలు చేశారు. ప్రస్తుతం  ఈ ఆడియో వైరల్‌ అవుతోంది. 

స్థానిక ఎమ్మెల్యే తమ్మరాజుపల్లె మైనింగ్‌ టిప్పర్ల నుంచి ఏ విధంగా వసూలు చే«శారనే విషయంపై ఇద్దరు టీడీపీ నాయకుల మధ్య ఫోన్‌ సంభాషణ హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ ఆడియోలో పాణ్యంకు చెందిన టీడీపీ నాయకుడు పేరికల పుల్లారెడ్డి, తమ్మరాజుపల్లెకు చెందిన మరో టీడీపీ నేత, మైనింగ్‌ వ్యాపారి షేక్షావలి మధ్య సంభాషణ ఇదీ..  

పుల్లారెడ్డి:  అన్నా నమస్తే..  చంద్రబాబు నుంచి ఫోన్‌ వచ్చిoది. తమ్మరాజుపల్లెలో టిప్పర్‌కు  రూ. 3 వేలు వసూలు చేస్తున్నారంటా కదన్నా.. 
షేక్షావలి: ఫస్ట్‌ ఒక నెల ఇచ్చాం 
పుల్లారెడ్డి: రేపు, ఎల్లుండో ఈ  విషయం పేపర్లో వస్తుంది. నువ్వు, బాలరాజు కలిసి వసూలు చేశారంట కదా?  
షేక్షావలి: మా ఊర్లో కొంత మంది ఉన్నారు. వారు వసూలు చేశారు. 
పుల్లారెడ్డి: టిప్పర్‌కు నెలకు రూ. 3 వేలు 
వసూలు చేసి ఎమ్మెల్యేకు ఇచ్చే వాటా గురించి బైరెడ్డికి తెలిసింది. 
షేక్షావలి:  ఒక నెల మాత్రమే. టిప్పర్ల యజమానులందరం కలిసి వసూలు చేసి ఇచ్చాం. 
పుల్లారెడ్డి: ఎందుకు వసూలు చేస్తారు? 200 టిప్పర్లు అంటే రూ. 6 లక్షల అవుతుంది. 
ప్రతి నెలా 1వ తేదీన వసూలు చేస్తున్నారని తెలిసింది. నాకు హైకమాండ్, టీడీపీ నేతలు కూడా చెప్పమనడంతో చెబుతున్నాం.  
షేక్షావలి: మొదట్లో  టిప్పర్లు ఆపారు. టిప్పర్ల యాజమానులతో మాట్లాడి  వసూలు చేసి ఇచ్చారు. 
పుల్లారెడ్డి:  నువ్వు కూడా ఇచ్చావు కదా.. 
షేక్షావలి:  నేనే కాదు. అందరూ ఇచ్చారు. 
పుల్లారెడ్డి:  ఎమ్మెల్యేకు రూ. 3 వేలు ఇచ్చావా.. 
అని సీఎం అడిగితే చెబుతావు కదా. 
షేక్షావలి:  అంత వరకు ఎందుకు పెద్దన్న? 
పుల్లారెడ్డి:  మన ఊర్లోకి వచ్చి డబ్బులు వసూలు చేయడం ఏందన్నా.. 
షేక్షావలి:  లేదు. ఒక నెలనే ఇచ్చాం 
పుల్లారెడ్డి:  నీకు 10 టిప్పర్లు ఉన్నాయి కదా.. నీకు సీఎం చంద్రబాబునాయుడు ఫోన్‌ చేస్తే డబ్బులు ఇచ్చానని చెబుతావు కదా.. 
షేక్షావలి: అంత వరకు ఎందుకు అన్న 
పుల్లారెడ్డి: యా ఊరు నా..కొ..లు వచ్చి .. 
మన పుణ్యానా గెలిచి .. మనతో డబ్బులు వసూలు చేయడమేందన్నా? 
షేక్షావలి:  ఇప్పుడేం తీసుకోవడంలేదులే 
పుల్లారెడ్డి:  బైరెడ్డికి చెప్పడానికి. 
షేక్షావలి:   నేను (పార్టీకి) ఎంతకావాలంటే అంత చేశాను. వద్దులే అన్న 
పుల్లారెడ్డి:  డబ్బులిచి్చనట్లు రికార్డు చేసి హెడ్‌ఆఫీసుకు పంపుతాను 
షేక్షావలి: వద్దులే.. 
పుల్లారెడ్డి:  మైనింగ్‌పై ఆధారపడి వారు ప్రభుత్వానికి కట్టాలి 
షేక్షావలి: రికార్డు చేయడం బాగులేదు.. 
పుల్లారెడ్డి: త్రమ్మాజుపల్లె టిప్పర్ల దగ్గర వసూలు చేసిన విషయం సీఎంకు వాయిస్‌ రికార్డు చేసి పంపుతాను  
షేక్షావలి:  ఇదీ చిన్న విషయం.. ఎందుకు వదిలే పెద్దన్నా.. చిన్నదాన్ని పెద్దది చేయకు 
పుల్లారెడ్డి: యా ఊరి వాళ్లో ఈరోజు ఉండి రేపు వెళ్లే వారు డబ్బులు వసూలు చేస్తే మేము అడుక్కతినాలా?  ఈ రికార్డు 
కూడా బైరెడ్డికి పంపుతాను.

పుల్లారెడ్డిపై దాడి.. తలకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి  తరలింపు 
ఈ ఆడియో సామాజిక మాధ్య­­మాల్లో వైరల్‌ అవుతుండగానే అందులో ఓ నాయకుడిగా ఉన్న పెరికల పుల్లారెడ్డిపై దాడి జరిగింది. పుల్లారెడ్డికి, షెక్షావలికి  కొంత కాలంగా మనస్పర్థలు ఉన్నట్లు చెబుతున్నారు. తనపై ఇతరులకు చెడుగా చెబుతున్నావని పుల్లారెడ్డి ఫోన్‌­లో నిలదీయగా పాణ్యంకు వచ్చి మాట్లాడతా­న­ని షెక్షావలి బదులిచ్చాడు. 

శనివారం  పుల్లా­రెడ్డి కుమారుడితో కలిసి బైక్‌పై పాణ్యం వస్తుండగా జుర్రాగు వద్ద షేక్షావలి, బాలరాజు, పెద్ద షేక్షావలిలు బైక్‌తో ఢీకొట్టి కర్రలతో దాడి చేసినట్లుగా చెబుతున్నారు. ఈ దాడి­లో పుల్లారెడ్డి, ఆ­యన కుమారుడికి గాయమైంది. పుల్లారెడ్డి ఫిర్యా­దు మేరకు కేసు నమోదు చేశారు.

కాగా, పుల్లారెడ్డి, అతని కుమారుడిపై కౌంటర్‌ కేసు నమో­దు చేసినట్లు ఎస్‌ఐ శనివారం తెలిపారు. తన క్రషర్‌ వ్యాపారంలో భాగస్వామ్యం కావాలని పుల్లారెడ్డి, అతని కుమారుడు వేధించారని షేక్షావలి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కౌంటర్‌ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement