pullareddy
-
దందా కోసం దందా!
పాణ్యం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి రంగంలోనూ పలువురు ప్రజాప్రతినిధులు, నేతల దందాలు విపరీతంగా పెరిగిపోయాయి. వారు అడిగినంత ముట్ట చెప్పాలని, లేదంటే వ్యాపారాలే విడిచి పెట్టి వెళ్లిపోవాల్సిందే అన్నట్లుగా మారిపోయింది. మద్యం, ఇసుక, మైనింగ్ ఇలా ప్రతి రంగంలో అందిన కాడికి దోచుసుకొంటున్నారు. అడ్డొచి్చన వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. ఈ దందాలో టీడీపీ నేతల మధ్యే పోటీ నడుస్తోంది. ఒక నేతకు డబ్బులిస్తే మాకెందుకివ్వరంటూ మరో నేత వర్గీయులు వ్యాపారులను నిలదీస్తున్నారు. చివరకు ఈ దందా ఘర్షణలకూ దారి తీస్తోంది. వీటిని టీడీపీకి చెందిన వ్యాపారులే భరించలేక బయట పెట్టేస్తున్నారు. ఇలాంటి ఘటనే నంద్యాల జిల్లా పాణ్యంలో జరిగింది. అధికారి పార్టీ ఎమ్మెల్యేకు మైనింగ్ నిర్వాహకులు ఇచ్చిన వాటాలను సాక్షాత్తూ టీడీపీ నాయకులే బట్టబయలు చేశారు. ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ అవుతోంది. స్థానిక ఎమ్మెల్యే తమ్మరాజుపల్లె మైనింగ్ టిప్పర్ల నుంచి ఏ విధంగా వసూలు చే«శారనే విషయంపై ఇద్దరు టీడీపీ నాయకుల మధ్య ఫోన్ సంభాషణ హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఆడియోలో పాణ్యంకు చెందిన టీడీపీ నాయకుడు పేరికల పుల్లారెడ్డి, తమ్మరాజుపల్లెకు చెందిన మరో టీడీపీ నేత, మైనింగ్ వ్యాపారి షేక్షావలి మధ్య సంభాషణ ఇదీ.. పుల్లారెడ్డి: అన్నా నమస్తే.. చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చిoది. తమ్మరాజుపల్లెలో టిప్పర్‌కు రూ. 3 వేలు వసూలు చేస్తున్నారంటా కదన్నా.. షేక్షావలి: ఫస్ట్ ఒక నెల ఇచ్చాం పుల్లారెడ్డి: రేపు, ఎల్లుండో ఈ విషయం పేపర్లో వస్తుంది. నువ్వు, బాలరాజు కలిసి వసూలు చేశారంట కదా? షేక్షావలి: మా ఊర్లో కొంత మంది ఉన్నారు. వారు వసూలు చేశారు. పుల్లారెడ్డి: టిప్పర్‌కు నెలకు రూ. 3 వేలు వసూలు చేసి ఎమ్మెల్యేకు ఇచ్చే వాటా గురించి బైరెడ్డికి తెలిసింది. షేక్షావలి: ఒక నెల మాత్రమే. టిప్పర్ల యజమానులందరం కలిసి వసూలు చేసి ఇచ్చాం. పుల్లారెడ్డి: ఎందుకు వసూలు చేస్తారు? 200 టిప్పర్లు అంటే రూ. 6 లక్షల అవుతుంది. ప్రతి నెలా 1వ తేదీన వసూలు చేస్తున్నారని తెలిసింది. నాకు హైకమాండ్, టీడీపీ నేతలు కూడా చెప్పమనడంతో చెబుతున్నాం. షేక్షావలి: మొదట్లో టిప్పర్లు ఆపారు. టిప్పర్ల యాజమానులతో మాట్లాడి వసూలు చేసి ఇచ్చారు. పుల్లారెడ్డి: నువ్వు కూడా ఇచ్చావు కదా.. షేక్షావలి: నేనే కాదు. అందరూ ఇచ్చారు. పుల్లారెడ్డి: ఎమ్మెల్యేకు రూ. 3 వేలు ఇచ్చావా.. అని సీఎం అడిగితే చెబుతావు కదా. షేక్షావలి: అంత వరకు ఎందుకు పెద్దన్న? పుల్లారెడ్డి: మన ఊర్లోకి వచ్చి డబ్బులు వసూలు చేయడం ఏందన్నా.. షేక్షావలి: లేదు. ఒక నెలనే ఇచ్చాం పుల్లారెడ్డి: నీకు 10 టిప్పర్లు ఉన్నాయి కదా.. నీకు సీఎం చంద్రబాబునాయుడు ఫోన్ చేస్తే డబ్బులు ఇచ్చానని చెబుతావు కదా.. షేక్షావలి: అంత వరకు ఎందుకు అన్న పుల్లారెడ్డి: యా ఊరు నా..కొ..లు వచ్చి .. మన పుణ్యానా గెలిచి .. మనతో డబ్బులు వసూలు చేయడమేందన్నా? షేక్షావలి: ఇప్పుడేం తీసుకోవడంలేదులే పుల్లారెడ్డి: బైరెడ్డికి చెప్పడానికి. షేక్షావలి: నేను (పార్టీకి) ఎంతకావాలంటే అంత చేశాను. వద్దులే అన్న పుల్లారెడ్డి: డబ్బులిచి్చనట్లు రికార్డు చేసి హెడ్‌ఆఫీసుకు పంపుతాను షేక్షావలి: వద్దులే.. పుల్లారెడ్డి: మైనింగ్‌పై ఆధారపడి వారు ప్రభుత్వానికి కట్టాలి షేక్షావలి: రికార్డు చేయడం బాగులేదు.. పుల్లారెడ్డి: త్రమ్మాజుపల్లె టిప్పర్ల దగ్గర వసూలు చేసిన విషయం సీఎంకు వాయిస్ రికార్డు చేసి పంపుతాను షేక్షావలి: ఇదీ చిన్న విషయం.. ఎందుకు వదిలే పెద్దన్నా.. చిన్నదాన్ని పెద్దది చేయకు పుల్లారెడ్డి: యా ఊరి వాళ్లో ఈరోజు ఉండి రేపు వెళ్లే వారు డబ్బులు వసూలు చేస్తే మేము అడుక్కతినాలా? ఈ రికార్డు కూడా బైరెడ్డికి పంపుతాను.పుల్లారెడ్డిపై దాడి.. తలకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలింపు ఈ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగానే అందులో ఓ నాయకుడిగా ఉన్న పెరికల పుల్లారెడ్డిపై దాడి జరిగింది. పుల్లారెడ్డికి, షెక్షావలికి కొంత కాలంగా మనస్పర్థలు ఉన్నట్లు చెబుతున్నారు. తనపై ఇతరులకు చెడుగా చెబుతున్నావని పుల్లారెడ్డి ఫోన్లో నిలదీయగా పాణ్యంకు వచ్చి మాట్లాడతానని షెక్షావలి బదులిచ్చాడు. శనివారం పుల్లారెడ్డి కుమారుడితో కలిసి బైక్‌పై పాణ్యం వస్తుండగా జుర్రాగు వద్ద షేక్షావలి, బాలరాజు, పెద్ద షేక్షావలిలు బైక్‌తో ఢీకొట్టి కర్రలతో దాడి చేసినట్లుగా చెబుతున్నారు. ఈ దాడిలో పుల్లారెడ్డి, ఆయన కుమారుడికి గాయమైంది. పుల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.కాగా, పుల్లారెడ్డి, అతని కుమారుడిపై కౌంటర్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శనివారం తెలిపారు. తన క్రషర్ వ్యాపారంలో భాగస్వామ్యం కావాలని పుల్లారెడ్డి, అతని కుమారుడు వేధించారని షేక్షావలి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కౌంటర్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
ప్రజ్ఞారెడ్డి వినతిపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
-
పుల్లారెడ్డి మనవడు అరాచకం
-
ఆకట్టుకున్న హారిక ప్రసంగం
కర్నూలు సిటీ: ఏపీ ప్రభుత్వం, ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ పూణే కలిసి అమరావతిలో నిర్వహిస్తున్న జాతీయ మహిళ పార్లమెంట్ సదస్సులో జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని కె.హారిక ప్రసంగం ఆకట్టుకుంది. శుక్రవారం నిర్వహించిన సదస్సులో హారిక ..ఉమెన్ స్టేటస్ అండ్ డిసిసెన్ మేకింగ్ అనే అంశంపై మాట్లాడారు. మాట్లాడిన తీరుకు ప్రముఖులను ఆకట్టుకోవడంతో ఆ విద్యార్థినికి అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని ఆ కాలేజీ ప్రిన్సిపల్ బి.శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జీపీఎస్ ఆధారిత డ్రోన్స్‌పై దృష్టి
- పుల్లారెడ్డి కాలేజీ ఈసీఈ విభాగాధిపతి - ముగిసిన వర్క్‌షాప్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : రాబోయే రోజుల్లో గ్లోబల్ పోజిషన్ సిస్టమ్(జీపీఎస్) ఆ«ధారిత డ్రోన్స్‌ను తయారు చేస్తామని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ సురేష్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం నాన్ జీపీఎస్ ఆధారిత డ్రోన్స్, రోటర్స్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా వినియోగిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో డ్రోన్స్ సేవలను భారత సైన్యం వినియోగించే అవకాశం ఉందన్నారు. కళాశాలలో టెక్నికల్ జిజ్ఞాసా–2016 జాతీయ వర్కుషాపు రెండో రోజు కొనసాగింది. ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో 108 కళాశాలల విద్యార్థులు సొంతంగా డ్రోన్స్ తయారు చేసి గాల్లో ఎగుర వేశారు. ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో మ్యాట్‌ల్యాబ్ వర్కుషాపు నిర్వహించగా..50 కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారని హెచ్ఓడీ బ్రహ్మానందరెడ్డి తెలియజేశారు. మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో వాటర్ రాకెట్‌ను తయారు చేసి విద్యార్థులు ప్రయోగించారు. సివిల్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో టోటల్ స్టేషన్ అనే అంశంపై వర్కుషాపు నిర్వహించారు. కంప్యూటర్ విభాగం ఆధ్వర్యంలో ఎన్ఎస్=2 నెట్వర్కు సిములేటర్–2 అనే అంశంపై వర్కషాపు జరిగినట్లు విభాగాధిపతి డాక్టర్ కాశీవిశ్వనాథ్ తెలిపారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బాలాజీ ప్రశాంస పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, జిజ్ఙాసా–2016 కన్వీనర్ డాక్టర్ పీ.అబ్దుల్ ఖయూమ్ పాల్గొన్నారు. -
దంపతులపై దుండగుల దాడి: భర్త మృతి
పొన్నలూరు: ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం పాగసింగరబట్ల పాలెంలో సోమవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. బైకుపై వెళ్తున్న దంపతులపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా.. భార్యకు గాయాలయ్యాయి. మృతుడు ఆర్టీసీ డ్రైవర్ పుల్లారెడ్డిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏసీబీ వలలో దొర్నిపాడు ఆర్ఐ, వీఆర్ఓ
దొర్నిపాడు : లంచం తీసుకుంటూ దొర్నిపాడు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, దొర్నిపాడు వీఆర్ఓ పుల్లారెడ్డి శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కర్నూలు ఏసీబీ డీఎస్పీ మహబూబ్‌బాష తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దొర్నిపాడులోని పయిడాల సుబ్బారెడ్డి కుమారుడు శివరామిరెడ్డి 925-1 సర్వే నెంబర్లో 5.30 ఎకరాలు మెట్టపొలం సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 1994లో 2 ఎకరాల పొలం తన భార్య పి.కళావతి పేరిట రిజిష్టర్ చేయించాడు.10 సంవత్సరాల తర్వాత పాస్‌బుక్‌లు, టైటిల్‌డీడ్స్ కోసం అప్పటి వీఆర్ఓ వెంకటస్వామి(ప్రస్తుతం ఆర్ఐ), వీఆర్ఓ పుల్లారెడ్డిని అడగడంతో కొంతకాలంగా రూ.5 వేలు ఇస్తేనే పట్టాదారుపాస్‌బుక్‌లు. టైటిల్‌డీడ్స్ ఇస్తామని చెప్పారు. డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పుకున్నప్పటికి కనికరించకుండా తిప్పుకోవడంతో చివరకు రూ2000కు ఒప్పందం చేసుకున్నారు. విసుగు చెందిన శివరామిరెడ్డి చివరకు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్నారు. తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా సర్కిల్ఇన్స్పెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డితో కలిసి టీకొట్టు వద్ద మాటువేశారు. రైతు శివరామిరెడ్డి డబ్బు తెచ్చి ఆర్ఐను సంప్రదించగా వీఆర్ఓ పుల్లారెడ్డికి ఇవ్వాలని సూచించడంతో రైతు వెంటనే వీఆర్ఓ పుల్లారెడ్డికి అందిస్తుండగా వెంటనే ఏసీబీ అధికారులు అప్రమతమై లంచం తీసుకుంటున్న వీఆర్ఓను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆర్ఐ వెంకటస్వామి కార్యాలయం వెనుకవైపు నుండి పారిపోయాడు. పరారీలో వున్న ఆర్ఐతోపాటు వీఆర్ఓపై కేసు నమోదు చేసిన ట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. -
నిరసన హోరు
సాక్షి, కడప: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా వైఎసార్కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించారు. కడపలో నగర సమన్వయకర్త అంజాద్‌బాషా, అధికారప్రతినిధి అఫ్జల్ఖాన్, హఫీజుల్లా, పాకాసురేష్ ఆధ్వర్యంలో ఏడురోడ్ల కూడలి వద్ద మానవహారం నిర్వహించి సమైక్య నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలిగే శక్తి జగన్‌కు మాత్రమే ఉందన్నారు. పులివెందులలో మున్సిపల్ మాజీ చైర్మన్ రుక్మిణీదేవి, మునిసిపాలిటీ పరిశీలకుడు వరప్రసాద్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేశారు. పాతబస్టాండ్ సమీపంలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి పూల అంగళ్ల వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడి సమైక్యనినాదాలు చేశారు. మైదుకూరులో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకుడు గంగాధర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి సమైక్యనినాదాలు చేశారు. ప్రొద్దుటూరులో నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. పుట్టపర్తి సర్కిల్లో మానవహారంగా ఏర్పడి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించారు. రాజకీయపార్టీల అధ్యక్షుల్లో వైఎస్ జగన్ ఒక్కడే నిజమైన సమైక్యవాది అని రాచమల్లు అన్నారు. కమలాపురంలో రైతువిభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబటూరు బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. సమైక్యనినాదాలు చేశారు. రైల్వేకోడూరులో డీసీసీబీ మాజీ చైర్మన్ కొల్లం బ్రహ్మానందరెడ్డి, పట్టణ కన్వీనర్ రమేష్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థులు కూడా తరలివచ్చారు. వైఎస్సార్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి సమైక్యనినాదాలు చేశారు. బద్వేలులో సమైక్యాంధ్రకు మద్దతుగా మానవహారం నిర్వహించారు. నాలుగురోడ్ల కూడలిలో మునిసిపల్ మాజీ చైర్మన్ మునెయ్య ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.