గ్రేటర్ పరిధిలో చెత్త సేకరించే వాహనాలకు జీపీఎస్ అనుసంధానం ప్రారంభమైంది.
గ్రేటర్ పరిధిలో చెత్త సేకరించే వాహనాలకు జీపీఎస్ అనుసంధానం ప్రారంభమైంది. స్వచ్ఛ ఆటో టిప్పర్లకు ముందుగా అనుసంధాన ప్రక్రియ మొదలుపెట్టారు. బుధవారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆటోలకు జీపీఎస్ ఏర్పాటు చేశారు. ఈ విధానంతో కేంద్ర కార్యాలయంలోని వారు చెత్త తరలించే ఆటో ఏప్రాంతంలో ఉందో తెలుసుకోవచ్చు. దీంతోపాటు స్థానిక సిబ్బంది సమాచారం మేరకు అవసరమైన ప్రాంతానికి పంపే వీలుంటుంది.