
జీపీఎస్, కపిలాక్షీ
జీపీఎస్ హీరోగా కపిలాక్షీ మల్హోత్రా, సోనాక్షీ వర్మ కథానాయికలుగా నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. మురళీ రామస్వామి దర్శకత్వంలో ఎస్‌ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాహుల్ భాయ్ మీడియా, దుర్గశ్రీ ఫిల్మ్స్, పి.ఎస్. రామకృష్ణ నిర్మించారు. ఈ సినిమా టీజర్ లాంచ్‌లో అతిథిగా పాల్గొన్న పి.వి.ఆర్. విష్ణు మాట్లాడుతూ– ‘‘సినిమాల పట్ల మంచి అభిరుచి ఉన్న నిర్మాత రామకృష్ణ. టీజర్ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు మురళి కష్టం తెలుస్తోంది’’ అన్నారు. ‘‘నిర్మాతగా ఇది నా తొలి చిత్రం.
ఈ సినిమాతో జీపీఎస్ సంచలన హీరో అవుతారు. మురళి చాలా కష్టపడ్డారు. నా స్నేహితుడు యుగంధర్ వల్ల ఈ సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకువస్తున్నాను. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు రామకృష్ణ. ‘‘కంటెంట్ నచ్చి ఈ సినిమాలో భాగమయ్యాను’’ అన్నారు. ఈ సినిమా సహ–నిర్మాత రాహుల్ పండిట్. ‘‘ప్రతి మనిషిలోనూ మరో కోణం ఉంటుంది. అదే మా సినిమా’’ అన్నారు మురళి. ‘‘బ్రేక్ ద రూల్స్ అనేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు జీపీఎస్.
Comments
Please login to add a commentAdd a comment