illegal relatonsip
-
భార్య, భర్త.. మధ్యలో ప్రియుడు..క్రైమ్ కథా చిత్రమ్
సాక్షి, హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్: నగరంలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసును పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించారు. జ్యోతి ప్రవర్తనతో విసిగివేసారిన ఆమె భర్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చారు. హత్య చేసిన అనంతరం విజయవాడకు పారిపోయిన నిందితుడు శ్రీనివాసరావును రాచకొండ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరంలో మరెవరికీ ప్రమేయం లేదంటూ అతడు చెబుతున్నా... అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి దర్యాప్తు అధికారులు సాంకేతికంగా ఆరా తీస్తున్నారు. గురువారం అధికారికంగా నిందితుడి అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. భార్య ప్రవర్తనతో విసుగుచెంది... వారాసిగూడ ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు, జ్యోతి (28) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆమెకు ఏడాది క్రితం ఇదే ప్రాంతానికి చెందిన క్యాబ్ డ్రైవర్ యడ్ల యశ్వంత్‌తో పరిచయమైంది. ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య పలుమార్లు వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తాను యశ్వంత్‌ను విడిచి ఉండలేనని, తనకు మీరిద్దరూ కావాలంటూ జ్యోతి చెప్పడంతో విసుగు చెందాడు. దీంతో ఇద్దరినీ హతమార్చాలని నిర్ణయించుకున్నాడు శ్రీనివాసరావు. అభ్యంతరం లేదంటూ నమ్మించి... వారిని అంతమొందించాలని నిర్ణయించుకున్న శ్రీనివాసరావు ఆదివారం ఆ పని పూర్తి చేయాలని భావించాడు. దీనికి ముందే యశ్వంత్‌తో సంబంధం కొనసాగించడానికి తనకు అభ్యంతరం లేదంటూ భార్యతో చెప్పి ఆమెను నమ్మించాడు. ఆదివారం రాత్రి 7 గంటలకు జ్యోతితో యశ్వంత్‌కు ఫోన్ చేయించాడు. నగర శివార్లకు వెళ్దామంటూ చెప్పించడంతో యశ్వంత్ తన సోదరుడి వాహనం తీసుకుని వచ్చాడు. వారాసిగూడ నుంచి ముగ్గురూ రెండు బైక్‌లపై ఎల్బీనగర్ చేరుకున్నారు. అక్కడ జ్యోతికి శ్రీనివాస్ అనే వ్యక్తి కలిశాడు. ఆమెకు తన స్నేహితుడి ద్వారా శ్రీనివాస్‌తో అంతకుముందే పరిచయం ఉంది. బిల్లు చెల్లించి.. డబ్బులు బదిలీ చేసి.. ఎల్బీనగర్లోని ఓ పాదరక్షల దుకాణంలో జ్యోతి కొత్త చెప్పులు కొనుగోలు చేసింది. వీటి నిమిత్తం రూ.3 వేలు శ్రీనివాస్ చెల్లించాడు. అతడి ద్వారానే గూగుల్‌పే ద్వారా మరో రూ.5 వేలు తన భర్త శ్రీనివాసరావుకు బదిలీ చేయించింది. అక్కడి నుంచి శ్రీనివాస్ వెళ్లిపోగా.. జ్యోతి, శ్రీనివాసరావు, యశ్వంత్ బైక్‌లపై విజయవాడ జాతీయ రహదారి వైపు వెళ్లారు. ఈ దృశ్యాలు ఆ మార్గంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మార్గమధ్యలోని ఓ వైన్స్‌లో మద్యం, కూల్‌డ్రింక్స్ ఖరీదు చేశారు. రాత్రి మొత్తం శివార్లలోనే గడపాలనే ఉద్దేశంతో తమ వెంట ప్లాస్టిక్ చాప, ఎల్ఈడీ టార్చిలైట్, మూడు పవర్ బ్యాంక్స్ కూడా తీసుకువెళ్లారు. రాయితో కొట్టి.. స్క్రూడ్రైవర్‌తో పొడిచి... వీరు ముగ్గురూ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొత్తగూడెం గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కగా నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడి పొదల్లో యశ్వంత్, శ్రీనివాసరావు మద్యం తాగా రు. ఆపై ఏకాంతంగా గడిపేందుకు జ్యోతి, యశ్వంత్ కొంచెం దూరం వెళ్లారు. వీరిద్దరూ ఏకాంతంగా ఉండగా శ్రీనివాసరావు వెనక నుంచి రాయితో దాడి చేశాడు. దీంతో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన యశ్వంత్‌ను పక్కగా లాక్కెళ్లిన శ్రీనివాసరావు తన బైక్‌లో నుంచి స్క్రూడ్రైవర్ తీసి అతడి పొట్ట, గొంతుపై పొడిచా డు. మరో రాయితో అతడి మర్మాంగాన్ని ఛిద్రం చే సి, అక్కడ నుంచి విజయవాడకు పారిపోయాడు. చెప్పుల దుకాణం రసీదు ఆధారంగా.. జంట హత్యల విషయం మంగళవారం వెలుగులోకి రావడంతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలిలో లభించిన జ్యోతి హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న చెప్పుల దుకాణం బిల్లు ఆధారంగా శ్రీనివాస్ వివరాలు తెలుసుకుని ఆ దిశగా విచారణ జరిపారు. అతడి ద్వారానే శ్రీనివాసరావు ఫోన్ నంబర్ తీసుకున్నారు. భార్య జ్యోతి ఆదివారం నుంచి కనిపించకపోయినా స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయకపోవడంతో అతడిపై పోలీసులకు అనుమానం బలపడింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌లోనూ కొన్ని ఆధారాలు లభించాయి. అతడి సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా విజయవాడలో ఉన్నట్లు గుర్తించి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యల్లో మరెవరి ప్రమేయం లేదంటూ నిందితుడు చెబుతున్నాడు. మరికొంత సాంకేతిక దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు వివరించారు. (చదవండి: అబ్దుల్లాపూర్‌మెట్ హత్యలు: జ్యోతి కళ్ల ముందే యశ్వంత్‌ను చంపి, ఆపై..) -
హోటల్లో ప్రేయసితో భర్త.. భార్య చేసిన పనికి పరార్
భార్యకు తెలియకుండా మరో యువతితో సంబంధం కొనసాగిస్తున్న ఆ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం పెంచుకున్న ఆ భార్య.. టెక్నాలజీ సాయంతో భర్త గుట్టును బయటపెట్టింది. ఊహించని ఆ పరిణామంతో ప్రేయసితో కలిసి తుర్రుమన్నాడు ఉన్నాడు ఆ మొగుడు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. పూణే పోలీసులు శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన సదరు వ్యక్తి ఓ వ్యాపారవేత్త. అతని భార్య కూడా అదే కంపెనీకి డైరెక్టర్‌గా ఉంది. అయితే, 41 ఏళ్ల ఆ వ్యాపారవేత్త మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. వ్యాపారం పేరిట ఊర్లు పట్టుకుని తిరుగుతున్నానంటూ బిల్డప్‌లు ఇచ్చేవాడు. అయితే అతని వ్యవహారం ఆమెకు అనుమానం తెప్పించడం మొదలుపెట్టింది. దీంతో భర్త వాహనంలో జీపీఎస్ పరికరాన్ని రహస్యంగా అమర్చింది. గత ఏడాది నవంబరులో బెంగళూరు వెళుతున్నానని భార్యతో చెప్పాడు సదరు వ్యాపారి. కానీ, జీపీఎస్ లొకేషన్ మాత్రం.. ఆ వాహనం మహారాష్ట్రలోని పూణేలో ఉన్నట్టు చూపించింది. దీంతో ఆమె అనుమానం మరింత బలపడింది. వెంటనే భర్త బస చేసిన హోటల్ సిబ్బందిని ఆరా తీసింది. సీసీఫుటేజీని పరిశీలించగా.. మరో యువతితో అతగాడు లోపలికి వెళ్లాడు. పైగా ఆమే తన భార్య అంటూ.. భార్య పేరిట ఉన్న ఆధార్‌కార్డును చూపించాడట. ఆధార్‌కార్డు తనదని, పరిశీలించకుండా రూమ్ ఎలా కేటాయించారంటూ ఆమె హోటల్ సిబ్బందిపై ఫైర్ అయ్యింది. అంతేకాదు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత పూణే పోలీసులు.. తాజాగా 419 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా, హోటల్ యవ్వారం భార్యకు తెలిసిపోవడంతో సదరు వ్యాపారవేత్త, అతడి ప్రేయసి ఆ సమయంలోనే పరార్ అయ్యారు. అప్పటి నుంచి వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఇంట్లో శ్రీమతి.. ఓయోలో ఆయన.. మరి దొంగోడు??
వివాహేతర సంబంధాన్ని భార్యకు తెలియకుండా కప్పిపెట్టాలన్న ఆ భర్త ప్రయత్నం బెడిసికొట్టిందా?. మామూలుగా దొరికి ఉంటే భార్య ఒక్కదాని దగ్గరే బుక్ అయిపోయేవాడేమో. కానీ, దొంగతనం డ్రామా ఆడడం.. ఆపై పోలీసులను లాగిన కూపితో అసలు దొంగ బయటపడ్డాడు. దీంతో నిన్నంతా సోషల్ మీడియాలో ప్రముఖ హిందీ జర్నలిస్ట్ అతుల్ అగర్వాల్ మీద విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. న్యూఢిల్లీ: నొయిడా(యూపీ) కేంద్రంగా నడిచే హిందీ ఖబర్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ అతుల్ అగర్వాల్.. వారం క్రితం(జూన్ 19 అర్ధరాత్రి) తన ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు. ఆయుధాలతో వచ్చిన కొందరు తనను అడ్డగించి.. బెదిరించి ఐదు వేల రూపాయలు లాక్కున్నారని, చంపేస్తారనే భయంతో బతిమాలుకోగా వదిలేశారని, ఆ క్షణం బిడ్డను తల్చుకుని ఎంతో భయపడ్డానని.. ఇలా తన భావాలన్నింటిని కలగలిపి పెద్ద పోస్టుతో ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. అయితే ఆయన ప్రముఖ జర్నలిస్ట్ కావడంతో ఫిర్యాదు చేయకపోయినా.. సుమోటోగా నొయిడా పోలీసులు దారిదొపిడీ కేసు నమోదు చేసుకున్నారు. ఐదుగురు ఆఫీసర్లు మొత్తం ఆయన తిరిగే రూట్లలో జల్లెడ పట్టి.. సీసీ కెమెరాల నుంచి ఫుటేజీలను,ఆధారాలను సంపాదించారు. ఇక్కడే అతుల్ అడ్డంగా దొరికిపోయాడు. Noida police claim journalist Atul Agarwal had make false allegation of loot in Greater Noida west. There were several contradictions in statement, which has been proven thru electronic records.@CP_Noida @noidapolice pic.twitter.com/nmFAXpff25 — priyanktripathi (@priyanktripathi) June 25, 2021 గర్ల్‌ఫ్రెండ్ ఇంటి నుంచి ఓయోకి.. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దొపిడీ జరిగిందని చెప్పిన రోజు సాయంత్రం స్టూడియో నుంచి సరాసరి ఏడు గంటలకు తన గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు అతుల్. సుమారు నాలుగు గంటల తర్వాత ఆయన భార్య(చిత్ర) నుంచి ఫోన్ కాల్ రావడంతో హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరాడు. అయితే నేరుగా ఆయన ఇంటికి వెళ్లలేదు. అర్ధరాత్రి ఒంటిగంటకు మళ్లీ ఆ గర్ల్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేసి.. ఓయో రూమ్ కోసం వెతుకుతున్నానని చెప్పాడు. పనిలో పనిగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఓయో రూంకి డబ్బులు చెల్లించి.. ఆ రాత్రి అక్కడే గడిపాడు. ఆ హోటల్ సీసీ ఫుటేజీలో ఆయన వెళ్తున్న దృశ్యాలు రికార్డయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో వ్యక్తిగత కారణాలతోనో, కుటుంబానికి భయపడో ఆయన అబద్ధం చెప్పి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు నొయిడా పోలీసులు ఆయన ఫిర్యాదు ఉత్తదేనని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు ఉంచారు. వహ్.. అతుల్‌జీ ఇక అతుల్ గుప్తా ఓయో వ్యవహారంపై సోషల్ మీడియాలో నిన్నంతా రచ్చ రచ్చ చర్చ నడిచింది. అతుల్ అల్లిన కథను ‘పతీ పత్నీ ఔర్ వో’ కథగా పోలుస్తూ జోకులు పేల్చారు. అతుల్ గుప్తా భార్య చిత్ర త్రిపాఠి కూడా జర్నలిస్ట్. ఆమె ఆజ్‌తక్ ఛానెల్లో యాంకర్. దీంతో ఈ యవ్వారం మధ్యలోకి ఆమెను కూడా లాగారు. సోషల్ మీడియాలో ఫన్నీ పోస్టులతో మొత్తానికి అతుల్‌ను ఒక ఆట ఆడుకున్నారు. Vichitra Madam - Chellam sir, Where is #AtulAgarwal ? Chellam sir - He is in OYO. 😍🥰 pic.twitter.com/jHbzLiDCSA — किडे गुरजी 🕉🤝☪️ (@MARATHIKUNAL) June 25, 2021 #AtulAgarwal is one of from Dalal lobby Of sold media..😏#ChitraTripathi Reaction After His Good Performance ..😜 pic.twitter.com/HS34NGg4us — Kunal (@TheNameIzzKunal) June 26, 2021 On this Love Story No Caption needed: #AtulAgarwal with #ChitraTripathi on #Chitra pic.twitter.com/6vjhFkgHAM — Jazon🇮🇳 (@Jkhr29) June 26, 2021 చదవండి: జీతాల్లివ్వట్లేదని యాంకర్ గోడు.. లైవ్ ద్వారా వైరల్ -
ప్రియుడితో సంబంధం.. కూతురు అడ్డుగా ఉందని...
రాయ్‌బరేలి: కామంతో కళ్లు మూసుకుని రక్త సంబంధాలు మర్చిపోతున్నారు కొందరు. ఆ సమయంలో ఏం చేస్తున్నారో తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నారు. మద్యం తాగిన వారికన్నా కామం మత్తు మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో తమ కోరికకలకు అడ్డుగా ఉన్నారని భావిస్తే ఎవరినైనా హతమారుస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డంకిగా ఉందని భావించి తన కూతురును కన్నతల్లి చంపేసుకుంది. అనంతరం మృతదేహాన్ని బావిలోకి పడేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో జరిగింది. రాయ్‌బరేలీలోని దాల్మయి కోట్వాలీ మండలం సుర్సానా గ్రామానికి చెందిన సంతోశ్‌కుమార్ భార్య, కూతురు (5)తో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల హోలీ సందర్భంగా భార్య కూతురును తీసుకుని పుట్టింటికి వచ్చింది. పండుగ అనంతరం ఆమె తిరిగి రాలేదు. అనంతరం ఆమె అదృశ్యమైంది. ఆమె కోసం గాలిస్తుండగా ఆచూకీ లభించలేదు. ఈ సమయంలో ఆమె గురించి తెలిసిన వారు ఒకరు సమాచారం అందించారు. ఆమె తన ప్రియుడితో కలిసి పక్క ఊరిలో ఒక ఇంట్లో ఉంటోందని తెలిసింది. దీంతో భర్త వెంటనే అక్కడకు వెళ్లి భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. అయితే కూతురి విషయం అడగ్గా ఆమె సమాధానం ఇవ్వలేదు. కుటుంబసభ్యులు అంతటా గాలించారు పాప ఆచూకీ లభించలేదు. ఈ సమయంలో బావిలో బాలిక మృతదేహం కనిపించిందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు చేరుకుని మృతదేహం బయటకు తీయగా బాలిక కనిపించింది. వివరాలు సేకరించి బాలిక తల్లిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా తానే బాలికను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు.. ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు బావిలో పడేసినట్లు చెప్పింది. దీంతో భర్త, ఆమె కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. వెంటనే ప్రియుడితో పాటు ఆమెను జైలుకు తరలించారు. -
వివాహేతర సంబంధం: భార్య ఆత్మహత్య
సాక్షి, కర్నూలు: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం నంద్యాల పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.నంద్యాల టూటౌన్ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ మండలం ముత్తలూరు గ్రామానికి చెందిన గండ్ర పుల్లయ్య వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామానికి చెందిన కీర్తి (33)ని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ విద్యావంతులు కావటంతో పెళ్లి అనంతరం ఉద్యోగం కోసం నంద్యాల పట్టణానికి వచ్చి ఎస్బీఐ కాలనీలో ఉంటున్నారు. స్థానిక నాగార్జున ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పుల్లయ్య, గుడ్‌షెప్పర్డ్ స్కూల్లో టీచర్‌గా కీర్తి ఉద్యోగంలో చేరారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు సంతానం. సంతోషంగా సాగుతున్న వీరి సంసార జీవితంలో ఓ యువతి చిచ్చురేపింది. నాగార్జున కాలేజీలో చదువుకున్న సుభాషిణి ప్రస్తుతం నంద్యాల తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న ట్రెజరీ కార్యాలయంలో అసిస్టెంట్ క్లర్క్‌గా పనిచేస్తోంది. ఈ యువతి పుల్లయ్య స్టూడెంట్. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయంలో పుల్లయ్య, కీర్తి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఏకంగా సుభాషిణిని రెండో పెళ్లి చేసుకుని ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను కీర్తి సెల్‌కు పంపి వేధించేవారు.తమకు అడ్డుగా ఉన్నావంటూ సుభాషిణి తరచూ ఆమె ఫోన్‌కు మెసేజ్‌లు పెట్టడం, మరోవైపు భర్త కూడా మానసికంగా వేధింపులకు గురిచేయడంతో జీవితంపై విరక్తి చెందిన కీర్తి శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు కీర్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని అనుమానం వ్యక్తం చేస్తూ పుల్లయ్యకు దేహశుద్ధి చేయడంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. రెండో భార్య సుభాషిణి కూడా ఇంటికి తాళం వేసి వెళ్లింది. కాగా తన కుమార్తె చావుకు అల్లుడు, అతని రెండో భార్య సుభాషిణే కారణమని మృతురాలి తల్లి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ కంబగిరిరాముడు తెలిపారు. -
సొంత కూతురినే పెళ్లి చేస్కొని..
లిట్చ్‌ఫీల్డ్ కౌంటీ : కన్న కూతురినే వివాహం చేస్కొని.. ఆమెతో కొడుకుని సైతం కన్నాడు ఓ వ్యక్తి. ఆమెపై అనుమానం పెంచుకుని ఆమెను-కొడుకును చంపేశాడు. చివరకు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నార్త్ కరోలినాకు చెందిన స్టీవెన్ ప్లాదల్(42) తన కూతురు క్యాటీ(20)ని చిన్నతనంలోనే న్యూయార్క్‌కు చెందిన ఆంటోనీ ఫస్కో అనే వ్యక్తికి దత్తత ఇచ్చేశాడు. అయితే స్టీవెన్ మాత్రం గత కొన్నేళ్లుగా కూతురితోనే సంబంధం నెరుపుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో వీరికి వివాహం కాగా.. ఓ కొడుకు కూడా జన్మించాడు. చివరకు పెంపుడు తండ్రి వీరిద్దరి బంధానికి అడ్డుచెప్పటంతో.. క్యాటీ స్టీవెన్‌కు బ్రేకప్ చెప్పేసింది. అయితే స్టీవెన్ మాత్రం ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందేమోనన్న అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వాళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. కొడుకు బెన్నెట్‌ను స్టీవెన్ చంపేశాడు. అనంతరం క్యాటీ, ఆమె పెంపుడు తండ్రి ఆంటోనీని ఓ ట్రక్కులో కొంత దూరం తీసుకెళ్లి కాల్చి చంపాడు. ఘటన తర్వాత పారిపోయిన స్టీవెన్ తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు స్టీవెన్ తన తల్లికి పూర్తి సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. న్యూమిల్‌ఫోర్డ్ సమీపంలోని ఓ ట్రక్కులో వీరిద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. లిట్చ్‌ఫీల్డ్ కౌంటీలో స్టీవెన్ మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు. స్టీవెన్ భార్య విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నట్లు సమాచారం. -
కొడుకు, కూతుర్ని పెళ్లి చేసుకుంది.. కానీ!
వాషింగ్టన్ : అమెరికాకు చెందిన ఓ మహిళ మాతృత్వానికే మచ్చ తెచ్చే పనులు చేసి తీవ్ర విమర్శల పాలైంది. మోసానికి పాల్పడి గతంలో కన్న కొడుకును వివాహం చేసుకున్న ఆ తల్లి, గతేడాది కూతురును పెళ్లి చేసుకుని శారీరక సంబంధాలు కొనసాగించింది. అయితే బాలల హక్కుల కార్యకర్త ఫిర్యాదుతో ఈ ఆశ్చర్యకర నిజాలు వెలుగుచూశాయి. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఓక్లహామాలోని డంకన్‌లో పాట్రికా స్పాన్ (44), తన కూతురు మిస్టీ స్పాన్ తో కలిసి జీవిస్తోంది. కానీ వీరి సంబంధంపై స్థానికులు బాలల హక్కుల కార్యకర్తకు గతేడాది సెప్టెంబర్‌లో సమాచారం అందించారు. ఆ కార్యకర్త దీనిపై ఆరాతీయగా.. 2016 మార్చి నెలలో తల్లి పాట్రికా, కూతురు మిస్టీని ఒప్పించి వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తల్లీకూతురును అరెస్ట్ చేసి విచారించగా మరో పిడుగులాంటి వార్త పోలీసులకు తెలిసింది. పాట్రికా స్పాన్ దాదాపు రెండున్నర దశాబ్దాల కింద ఓ వ్యక్తిని వివాహం చేసుకోగా ఓ కూతురు, ఇద్దరు కుమారులు సంతానం కలిగారు. పిల్లలకు ఊహ తెలియని వయసులోనే భర్త నుంచి పాట్రికా విడాకులు తీసుకోగా.. ఆ పిల్లల నానమ్మ ముగ్గురిని దత్తత తీసుకుని వారి పోషణ చూస్తోంది. ఆరేళ్ల కిందట 18 ఏళ్లున్న తన పెద్ద కొడుకును రహస్యంగా వివాహం చేసుకుంది. మ్యారేజ్ లైసెన్స్‌లో వరుడు (కుమారుడు) ను ఓ పెద్దావిడ కుమారుడిగా చూపించడంతో పాటు తల్లినవుతానన్న విషయాన్ని దాచిపెట్టింది పాట్రికా. కుమారుడితో వివాహం అనంతరం శారీరక సంబంధం పెట్టుకున్న పాట్రికా.. కొంతకాలం తర్వాత అతడికి దూరంగా ఉంటోందని పోలీసులు గుర్తించారు. తొలుత తల్లీకూతురు వివాహం కేసులో వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష పడింది. ఇందులో తన తప్పులేదని కోర్టుకు విన్నవించుకోవడంతో కూతురు మిస్టీని రెండేళ్లపాటు కస్టడీకి ఆదేశించింది. తల్లి పాట్రికాపై నమోదైన కేసులపై వచ్చే (2018) జనవరిలో కోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. కాగా, కూతురు మిస్టీతో వివాహం చట్టానికి లోబడే చేసుకున్నానని నిందితురాలు పాట్రికా వాదిస్తోంది. -
వీడిన హత్య కేసు మిస్టరీ
– ఐదుగురు కిరాయి హంతకుల అరెస్ట్ – పరారీలో ప్రధాన నిందితుడు – మొదట అనుమానాస్పద కేసుగా నమోదు – పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యకేసుగా మార్పు – నిందితులను ఎస్పీ ఎదుట హాజరుపరచిన నంద్యాల పోలీసులు కర్నూలు : నంద్యాల మండలం విశ్వనగర్‌లో నివాసముంటున్న కౌలూరు చిన్నపెద్దన్న హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వదినతో వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తేల్చారు. సోదరుడు పెద్ద పెద్దన్న రూ.75 వేలు కిరాయికి ఒప్పందం కుదుర్చుకుని తన స్నేహితుల ద్వారా చిన్నపెద్దన్నను అంతమొందించినట్లు విచారణలో తేల్చారు. మొదట అనుమానాస్పదంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యకేసుగా మార్పు చేశారు. పక్కా సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం మహానందికి వెళ్లే దారిలోని బంగారుపుట్ట దగ్గర నిందితులు వడ్డె డేరింగుల సురేంద్ర అలియాస్ సూరి, వడ్డె మంజుల నాగరాజు అలియాస్ కొప్పు, కుందవరపు శేఖర్, కప్పల మురళి, సోమవరపు నాగ త్రిలోచన అలియాస్ బన్ను తదితరులను అరెస్టు చేశారు. నిందితులను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి, సీఐ మురళీధర్‌రెడ్డితో కలసి డీపీఓలోని వ్యాస్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలను వెల్లడించారు. హత్య అని తేలిందిలా.. ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీన కానాల గ్రామ పొలిమేరలోని చెట్ల పొదల్లో గుర్తు తెలియని మృతదేహం పడివున్నట్లు వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నంద్యాల రూరల్ పోలీసులు అనుమానాస్పద కింద కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహం ఛాతీపై 'కె.అమ్మ' భుజంపై 'విష్ణు', చేతిపై 'అన్న' అని మూడు తెలుగు అక్షరాల పచ్చబొట్లు ఉన్నాయి. టీషర్టు, జీన్స్‌ప్యాంటు, కాళ్లకు బూట్లు ధరించాడు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో మృతుని గొంతు, ఛాతీ భాగాల్లో మూడు కత్తిపోటు గాయాలు ఉన్నట్లు తేలడంతో చిన్న పెద్దన్న హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించి సెక్షన్ 174 సీఆర్పీసీని ఐపీసీ సెక్షన్ 302గా మార్పు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు ఇలా.. పత్రికల్లో వచ్చిన ఫొటోల ఆధారంగా అక్టోబర్ 25వ తేదీన హతుని తల్లి నారాయణమ్మ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి.. చనిపోయిన వ్యక్తి తన చిన్నకొడుకు చిన్నపెద్దన్నగా గుర్తించింది. ఆగస్టు 16వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లినట్లు పోలీసు విచారణలో బయటపడింది. చిన్న పెద్దన్న డ్రైవర్ వృత్తి చేస్తూ జీవనం సాగించేవాడు. సాయిబాబా నగర్‌లోని మణి వైన్స్‌లో మద్యం సేవించిన తర్వాత అతను కనపడలేదని విచారణలో బయటపడింది. కుటుంబ సభ్యులను విచారణ జరపగా.. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందున కిరాయి హంతకుల చేత హత్య చేయించినట్లు అతని అన్న పెద్ద పెద్దన్న అంగీకరించాడు. ఫుల్‌గా మద్యం తాపించి పథకం ప్రకారం హత్య చేసినట్లు విచారణలో బయటపడిందని ఎస్పీ వివరించారు. అభినందన ఎటువంటి ఆధారాలు లేని కేసు మిస్టరీని ఛేదించి నిందితులను అరెస్టు చేయడమే కాక నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నందుకు దర్యాప్తు అధికారి మురళీధర్‌రెడ్డి, రూరల్ ఎస్ఐ శివాంజల్, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు మల్లికార్జున, నాగరాజు, శ్రీనివాసులు తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు.