కూతురు మిస్టీతో ఆమెను పెళ్లి చేసుకున్న తల్లి పాట్రికా (ఫైల్ ఫొటో)
వాషింగ్టన్ : అమెరికాకు చెందిన ఓ మహిళ మాతృత్వానికే మచ్చ తెచ్చే పనులు చేసి తీవ్ర విమర్శల పాలైంది. మోసానికి పాల్పడి గతంలో కన్న కొడుకును వివాహం చేసుకున్న ఆ తల్లి, గతేడాది కూతురును పెళ్లి చేసుకుని శారీరక సంబంధాలు కొనసాగించింది. అయితే బాలల హక్కుల కార్యకర్త ఫిర్యాదుతో ఈ ఆశ్చర్యకర నిజాలు వెలుగుచూశాయి.
ఆ వివరాలిలా ఉన్నాయి.. ఓక్లహామాలోని డంకన్‌లో పాట్రికా స్పాన్ (44), తన కూతురు మిస్టీ స్పాన్ తో కలిసి జీవిస్తోంది. కానీ వీరి సంబంధంపై స్థానికులు బాలల హక్కుల కార్యకర్తకు గతేడాది సెప్టెంబర్‌లో సమాచారం అందించారు. ఆ కార్యకర్త దీనిపై ఆరాతీయగా.. 2016 మార్చి నెలలో తల్లి పాట్రికా, కూతురు మిస్టీని ఒప్పించి వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తల్లీకూతురును అరెస్ట్ చేసి విచారించగా మరో పిడుగులాంటి వార్త పోలీసులకు తెలిసింది. పాట్రికా స్పాన్ దాదాపు రెండున్నర దశాబ్దాల కింద ఓ వ్యక్తిని వివాహం చేసుకోగా ఓ కూతురు, ఇద్దరు కుమారులు సంతానం కలిగారు. పిల్లలకు ఊహ తెలియని వయసులోనే భర్త నుంచి పాట్రికా విడాకులు తీసుకోగా.. ఆ పిల్లల నానమ్మ ముగ్గురిని దత్తత తీసుకుని వారి పోషణ చూస్తోంది.
ఆరేళ్ల కిందట 18 ఏళ్లున్న తన పెద్ద కొడుకును రహస్యంగా వివాహం చేసుకుంది. మ్యారేజ్ లైసెన్స్‌లో వరుడు (కుమారుడు) ను ఓ పెద్దావిడ కుమారుడిగా చూపించడంతో పాటు తల్లినవుతానన్న విషయాన్ని దాచిపెట్టింది పాట్రికా. కుమారుడితో వివాహం అనంతరం శారీరక సంబంధం పెట్టుకున్న పాట్రికా.. కొంతకాలం తర్వాత అతడికి దూరంగా ఉంటోందని పోలీసులు గుర్తించారు. తొలుత తల్లీకూతురు వివాహం కేసులో వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష పడింది. ఇందులో తన తప్పులేదని కోర్టుకు విన్నవించుకోవడంతో కూతురు మిస్టీని రెండేళ్లపాటు కస్టడీకి ఆదేశించింది. తల్లి పాట్రికాపై నమోదైన కేసులపై వచ్చే (2018) జనవరిలో కోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. కాగా, కూతురు మిస్టీతో వివాహం చట్టానికి లోబడే చేసుకున్నానని నిందితురాలు పాట్రికా వాదిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment