సాక్షి, మంగళూరు : హిందూ మత సంప్రదాయలకు ఫిదా అయిన అమెరికా అమ్మాయి కన‍్నడ యువకుడిని వివాహం చేసుకుంది. కన‍్నడ యవకుడు, అమెరికా అమ‍్మాయి ఇద‍్దరూ ప్రేమించుకున్నారు. హిందూ సంస‍్కృతి, సంప్రదాయాలపట‍్ల అమితంగా ఆకర్షితురాలైన ఆమె హిందూ సంప్రదాయబద‍్దంగా పెళ్లి చేకుంది. ఈ సంఘటన మంగుళూరులో బుధవారం చోటుచేసుకుంది.
మంగళూరులోని పుత్తూరు ప్రాంతానికి చెందిన విక్రమ్ కామత్ అమెరికా అమ్మాయి కరోలిన్ మార్గరేట్ రోవ్లిని వివాహం చేసుకున్నాడు. విక్రమ్ కామత్ అమెరికలో ఉన్న ప్రవేట్ కంపెనిలో డెరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఇదే కంపెనిలో విధులు నిర్వహిస్తున్న కరోలిన్ మార్గరేట్ ఇద్దరు మొదట మంచి స్నేహితులుగా ఉంటూ అనంతరం ఇద్దరు ప్రేమించుకున్నారు. హిందూ సాంప్రదాయం అంటె ఇష్టమున్న కరోలిన్ ఇక్కడ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంది.
దాంతో మంగళూరుకు వచ్చిన ఇద్దరు పుత్తూరులోని కళ్లారేలో ఉన్న రఘువంశ నివాసంలో బుధవారం హిందూ సాంప్రదాయ పద్దతిలో కన్నడ అబ్బాయి, అమెరికా అమ్మాయి ఇద్దరు వివాహం చేసుకున్నారు. వివాహానికి ముందు కరోలిన్‌ను పుత్తూరుకు చెందిన గోపీకృష్ణ శణై, రాధిక శణై అనే దంపతులు దత్తత తీసుకుని అనంతరం ఈ దంపతులు కన్యాదానం చేసి పెళ్ళి జరిపించారు. ఈ నూతన దంపతుల వివాహ వేడుకలను, వివిద ధార్మిక కార్యక్రమాలను వేదమూర్తి దివాకర్ భట్ సాంప్రదాయ పద్దతిలో నిర్వహించారు. ఈ పెళ్ళి వేడుకలను పూర్తిగా అమెరికాలో ఉన్న కరోలిన్ తల్లిదండ్రులు విడియో కాన‍్ఫరెన్స్ ద్వారా తిలకించారు. ఈ హిందూ సాంప్రదాయ పెళ్ళి వేడుకల సందర‍్భగా కరోలిన్ పేరును విశాఖగా మార్చి నామకరణం చేశారు. దాంతో అమెరికా అమ్మాయి, కన్నడ అబ్బాయి ఇద్దరు హిందూ సాంప్రదాయ పద్దతిలో ఒక ఇంటివారు అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment