ఆ పెళ్లికి ట్రంప్‌ను ఆహ్వానించలేదు... | Donald Trump And Barack Obama Are Not Invited To Prince Harry Marriage | Sakshi
Sakshi News home page

ఆ పెళ్లికి ట్రంప్‌ను ఆహ్వానించలేదు...

Published Thu, Apr 12 2018 9:07 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

Donald Trump And Barack Obama Are Not Invited To Prince Harry Marriage - Sakshi

త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న ప్రిన్స్‌ హారీ - మేఘన్‌ మార్కెల్‌ (ఫైల్‌ ఫోటో)

లండన్‌ : బ్రిట్రీష్‌ యువరాజు, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ప్రిన్స్‌ హారీ వివాహానికి బ్రిటన్‌ ప్రెసిడెంట్‌ థెరిసా మేకు, అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌కు ఆహ్వానం అందలేదు. కారణమేంటంటే ప్రిన్స్‌ హారీ  - మేఘన్‌ మార్కెల్‌ల వివాహానికి కేవలం రాజవంశం, మేఘనల కుటుంబాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారిని మాత్రమే ఆహ్వానించాలనుకుంటున్నట్లు రాజ ప్రసాదం వారు ప్రకటించారు. రాజకీయ నాయకులేవరిని ఈ వివాహ వేడుకకు ఆహ్వానించలేదని తెలిపారు. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు బ్రిటన్‌ రాజ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికి  ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను ఆహ్వానించకుండా ఒబామాను ఆహ్వానించడం బాగుండదనే ఉద్ధేశంతో ఒబామాను కూడా ఆహ్వానించలేదు.

ఎందుకంటే బ్రిటన్‌ రాజ్యంగం చాలా సున్నితమైనది. దాని ప్రకారం బ్రిటన్‌ ప్రభుత్వం చేసే కార్యకలపాలు బ్రిటన్‌ రాజ్యంగ సమతౌల్యాన్నీ కాపాడుతూ విదేశీ వ్యవహరాలను సమీక్షించుకోవాలని బ్రిటన్‌ అధికార  ప్రతినిధి ఒకరు తెలిపారు. అందువల్లే ఈ వివాహ వేడుకను కేవలం బంధువలు, సన్నిహితుల సమక్షంలోనే నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఒక వేళ బ్రిటన్‌ ప్రధాన మంత్రి థెరిసా మేను ఆహ్వానించినా ఆమె వస్తుందని నమ్మకం లేదని బ్రిటీష్‌ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.హారీ సోదరుడు కేట్‌ మిడిల్‌టన్‌ వివాహం 2011లె వెస్ట్‌ మినిస్టర్‌ అబేలో జరిగింది. ఆ వేడుకకు చాలా మంది ప్రభుత్వ పెద్దలు హజరయ్యారు. అయితే ప్రస్తుతం హారీ వివాహ వేడుక విండ్సర్‌ కాస్టెల్‌ జరగనుంది. వైశాల్యంలో వెస్ట్‌ మినిస్టర్‌ అబేతో పోల్చితే విండ్సర్‌ కాస్టెల్‌ చాలా చిన్నది. హారీ - మేఘనల వివాహం మే 19న జరగనున్న సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement