టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పూణే ట్రాఫిక్ పోలీసులు ఊహించని షాకిచ్చారు. ముంబై – పూణే హైవేపై పరిమితికి మించిన వేగంతో కారును నడిపినందుకు మూడు చలాన్లు విధించారు. రిపోర్టుల ప్రకారం రోహిత్ శర్మ గంటకు 200 కి.మీ కంటే ఎక్కువ వేగంతో డ్రైవింగ్ చేసినట్లు తెలుస్తోంది.
పూణే మిర్రర్ నివేదిక ప్రకారం.. అతి వేగంగా వెళ్తున్న రోహిత్ కారును ఓ పోలీస్ ఉన్నతాధికారి అడ్డగించి, పోలీసు ఎస్కార్ట్‌తో జట్టు బస్సులో ప్రయాణించాలని సూచించారు. కాగా పాకిస్తాన్‌తో మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లకు 5 రోజుల బ్రేక్ లభించింది. పాక్ మ్యాచ్ అనంతరం హిట్‌మ్యాన్ అహ్మదాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో ముంబైకి చేరుకున్నాడు.
అయితూ వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆక్టోబర్ 19(గురువారం) పుణే వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో రెండు రోజుల పాటు కుటుబంతో కలిసి గడిపిన రోహిత్ శర్మ పూణేలో ఉన్న జట్టుతో కలిసేందుకు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నాడు. ముంబై నుంచి తన లంబోర్గిని ఉరుస్ కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా రోహిత్ శర్మ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 217 పరుగులు చేశాడు.
చదవండి: World Cup 2023: మిచెల్ శాంట్నర్ అద్బుతం.. క్యాచ్ ఆఫ్‌ది టోర్నమెంట్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment