రెండు నెలలైనా కొలిక్కిరాని దభోల్కర్ కేసు
Published Sun, Oct 20 2013 11:19 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
సాక్షి ముంబై: ఇప్పటివరకు గడ్డి, చెత్తతో నిర్మించిన గుడిసెల్లో నివసిస్తున్న ఆదివాసీల జీవన రేఖను మార్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలోని ఆదివాిసీ కుటుంబాలకు సుమారు 2.5 లక్షల పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ యోచిస్తోంది. ఈ మేరకు ఇందిరాగాంధీ గృహ నిర్మాణ పథకం కింద ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పథకానికి ఆమోదం లభిస్తే మొదటి విడతలో 1.66 లక్షల ఇళ్లు నిర్మిస్తారు. రెండో విడతలో మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వానికి సుమారు రూ.15 వేల కోట్లు ఖర్చు కానుందని అంచనా వేశారు. పథకం పూర్తయితే వచ్చే రెండేళ్లలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఆదివాసీ కుటుంబాలకు పక్కా ఇళ్లు లభిస్తాయి. కుగ్రామాలు, ఇతర అభివద్ధికి నోచుకోలేని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఆదీవాసీ ప్రజలు నివసిస్తున్నారు.
వీరు తమ ఇళ్లను మట్టి, చెత్త, గడ్డితో మురికి కాలువల పక్కన నిర్మించుకొని అందులో నివసిస్తున్నారు. ఉపాధి అవకాశాలు దొరుకుతున్నప్పటికీ ఎండ, వర్షం, చలికి వారు తలదాచుకుంటున్న ఇళ్లు తట్టుకోవడం లేదు. దీని ప్రభావం వారిజీవనంపై పడుతోంది. ఇలా దుర్భర జీవనం సాగిస్తున్న ఆదివాసీలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గిరిజన సంక్షేమ శాఖ చొరవ తీసుకుంది. కేంద్ర గ్రామాభివృద్ధి శాఖ నుంచి అదనంగా నిధులు అందుతాయి కాబట్టి సదరు శాఖా మంత్రి జైరామ్ రమేష్ లిఖిత పూర్వక వ్యవహారాలు ప్రారంభించేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ఆదివాసీలకు సొంత ఇంటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ గృహ నిర్మాణ పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రారంభంలో ఈ పథకం కింద రూ.90 వేల విలువ గల పక్కా ఇళ్లును నిర్మించి ఇచ్చారు. అయితే పరిమితిని పెంచి రూ. లక్ష చేశారు.
Advertisement
Advertisement