Dabholkar murder
-
ఆ ముగ్గురి హత్యల వెనుక ఒకే సంస్థ
ముంబై: హేతువాదులు నరేంద్ర దబోల్కర్, ఎంఎం కలబురిగి, జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యలకు ఒకే అతివాద సంస్థ కారణమని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. అయితే, హేతువాది, కమ్యూనిస్టు నేత గోవింద్ పన్సారే హత్యతో ఈ సంస్థకు లింకులున్నట్లు ఆధారాలు లభించలేదన్నారు. ‘దబోల్కర్, లంకేశ్, కలబురిగిల హత్యల్లో ఒకే రకమైన భావాలున్న వ్యక్తులు పాల్గొన్నట్లు గుర్తించాం. ఆ సంస్థలోని దాదాపు అందరు సభ్యులకూ సనాతన్ సంస్థతోనూ దాని అనుబంధ ‘హిందూ జనజాగృతి సమితి’తోనూ సంబంధాలున్నాయని తేలింది. పాల్ఘర్ జిల్లా నల్లసోపారలో ఇటీవల ఆయుధాలు, పేలుడు సామగ్రితోపాటు అరెస్టయిన వారికి దబోల్కర్, లంకేశ్, కలబురిగిల హత్యలతో ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైంది. వీరిచ్చిన సమాచారం ఆధారంగానే దబోల్కర్ హత్యతో సంబంధమున్న ఇద్దరిని అరెస్టు చేశాం. దీంతోపాటు ఈ ముగ్గురి హత్యలకు కీలక సూత్రధారి వీరేంద్ర సింగ్ తవాడేను కూడా పట్టుకున్నాం’ అని తెలిపారు. -
వారి హత్యల మధ్య సంబంధాలు
పుణే: జర్నలిస్టు గౌరీ లంకేశ్, హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్యల మధ్య సంబంధం ఉందని కోర్టుకు సీబీఐ తెలిపింది. దభోల్కర్ హత్య కేసు నిందితుల్లో ఒకరైన సచిన్ అందురే కస్టడీని పొడిగించాలని పుణే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టును కోరుతూ ఈ విషయం వెల్లడించింది. లంకేశ్ హత్యతో ప్రమేయమున్న నిందితుల్లో ఒకరు అందురేకు పిస్టోల్, మూడు బుల్లెట్లు అందచేసినట్లు సీబీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టు సచిన్ అందురే కస్టడీని ఆగస్టు 30 వరకూ పొడిగించింది. మరోవైపు దభోల్కర్ హత్య కేసులో మరో నిందితుడు శరద్ కలస్కర్ను కూడా తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం కలస్కర్ మరో కేసుకు సంబంధించి మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) అదుపులో ఉన్నాడు. -
రెండు నెలలైనా కొలిక్కిరాని దభోల్కర్ కేసు
సాక్షి ముంబై: ఇప్పటివరకు గడ్డి, చెత్తతో నిర్మించిన గుడిసెల్లో నివసిస్తున్న ఆదివాసీల జీవన రేఖను మార్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలోని ఆదివాిసీ కుటుంబాలకు సుమారు 2.5 లక్షల పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ యోచిస్తోంది. ఈ మేరకు ఇందిరాగాంధీ గృహ నిర్మాణ పథకం కింద ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పథకానికి ఆమోదం లభిస్తే మొదటి విడతలో 1.66 లక్షల ఇళ్లు నిర్మిస్తారు. రెండో విడతలో మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వానికి సుమారు రూ.15 వేల కోట్లు ఖర్చు కానుందని అంచనా వేశారు. పథకం పూర్తయితే వచ్చే రెండేళ్లలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఆదివాసీ కుటుంబాలకు పక్కా ఇళ్లు లభిస్తాయి. కుగ్రామాలు, ఇతర అభివద్ధికి నోచుకోలేని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఆదీవాసీ ప్రజలు నివసిస్తున్నారు. వీరు తమ ఇళ్లను మట్టి, చెత్త, గడ్డితో మురికి కాలువల పక్కన నిర్మించుకొని అందులో నివసిస్తున్నారు. ఉపాధి అవకాశాలు దొరుకుతున్నప్పటికీ ఎండ, వర్షం, చలికి వారు తలదాచుకుంటున్న ఇళ్లు తట్టుకోవడం లేదు. దీని ప్రభావం వారిజీవనంపై పడుతోంది. ఇలా దుర్భర జీవనం సాగిస్తున్న ఆదివాసీలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గిరిజన సంక్షేమ శాఖ చొరవ తీసుకుంది. కేంద్ర గ్రామాభివృద్ధి శాఖ నుంచి అదనంగా నిధులు అందుతాయి కాబట్టి సదరు శాఖా మంత్రి జైరామ్ రమేష్ లిఖిత పూర్వక వ్యవహారాలు ప్రారంభించేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ఆదివాసీలకు సొంత ఇంటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ గృహ నిర్మాణ పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రారంభంలో ఈ పథకం కింద రూ.90 వేల విలువ గల పక్కా ఇళ్లును నిర్మించి ఇచ్చారు. అయితే పరిమితిని పెంచి రూ. లక్ష చేశారు. -
సా..గుతున్న దర్యాప్తు
పుణే : సంఘ సంస్కర్త నరేంద్ర దభోల్కర్ హత్య జరిగిన నెల రోజులు గడుస్తున్నా నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫల మయ్యారు. ఇప్పటికీ నిందితుల వెదుకులాటలోనే పోలీస్ శాఖ ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల రోజుల్లో పోలీసులు ఇద్దరు అనుమానితుల ఊహాచిత్రాలను విడుదల చేశారు. డజన్ల సంఖ్యలో అనుమానితులను ప్రశ్నించారు.. కాని ఇప్పటివరకు ఎటువంటి ఫలితాన్నీ రాబట్టలేకపోయారు. జర్నలిస్టు, సంఘ సేవకుడు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న దభోల్కర్ను తెల్లవారుజామున వాకింగ్ వెళ్లి వస్తున్నప్పుడు పుణేలో అతడి ఇంటికి సమీపంలోనే ఆగస్టు 20వ తేదీన ఉదయం గం.7.30 ని.లకు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దుండగులు సుమారు నాలుగు బుల్లెట్లను పేల్చగా అందులో రెండు అతడి మెడ, వెనుక భాగంలో తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గర్లోనే ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయా డు. రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ హత్యను ఖండిం చారు. నిందితులను పట్టిచ్చినా లేదా వారి సమాచారం తెలిపిన వారికి రూ.10 లక్షల బహుమానం ప్రకటించారు. అయితే నిందితులను గుర్తించడంలో పోలీసులు ముందడుగు వేయలేకపోయారు. సంఘటన జరిగిన అనంతరం రాష్ట్ర హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ మాట్లాడుతూ త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామన్నారు. దభోల్కర్ అంతిమ సంస్కారాలకు చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్. ఆర్ఆర్ పాటిల్ సహా పలువురు ప్రముఖులు హాజరై నివాళులర్పించిన విషయం తెలిసిందే. 1989లో దభోల్కర్ ‘మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి(ఎంఏఎన్ఎస్)’ని స్థాపించి సమాజ ంలోని మూఢవిశ్వాసాలు, మంత్ర తంత్రాలు, బాబాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారు. ప్రభుత్వం ‘మూఢవిశ్వాసాల వ్యతిరేక చట్టం’ను అతడి హత్య జరిగిన మరుసటి రోజే ఆమోదించింది. ‘నెలరోజులుగా దభోల్కర్ హత్య కేసు దర్యాప్తు జరుగుతున్నా ఇప్పటివరకు ఎటువంటి సాక్ష్యాలను పోలీసులు సంపాదించలేకపోవడం చూస్తుంటే ఇది ప్రభుత్వ ప్రేరేపిత హత్యగా కనిపిస్తోంది..’ అంటూ గురువారం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని చెప్పవచ్చు. గురువారం తనను కలిసిన దభోల్కర్ కుమార్తె ముక్తా దభోల్కర్తో రాజ్ ఠాక్రే మాట్లాడుతూ మూఢవిశ్వాసాల వ్యతిరేక చట్టాన్ని ప్రభుత్వం ఇంతకుముందే ఆమోదించి ఉంటే దభోల్కర్ హత్య జరిగి ఉండేదని కాదని అభిప్రాయపడ్డారు. సీఎం క్షమాపణ చెప్పాలి: బీజేపీ దభోల్కర్ హత్యకుగురై నెలరోజులు గడుస్తున్నా ఎటువంటి ఆధారాలు సంపాదించకుండా సాగుతున్న దర్యాప్తుపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. కేసు విచారణ జరుపుతున్న పుణే క్రైం బ్రాంచి ఇప్పటికీ ఒక్క ఆధారాన్ని కూడా సంపాదించలేకపోయిందని, దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష నేత వినోద్ తావ్డే డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఓ హత్య కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు సంపాదించలేకపోవడం సిగ్గుచేటైన వ్యవహారమని, ఇప్పటికైనా దర్యాప్తు బాధ్యతలను సీబీఐ, ఎన్ఐఏ వంటిసంస్థలకు అప్పగించాలని తావ్డే డిమాండ్ చేశారు.