నరేంద్ర దభోల్కర్, గౌరీ లంకేశ్
పుణే: జర్నలిస్టు గౌరీ లంకేశ్, హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్యల మధ్య సంబంధం ఉందని కోర్టుకు సీబీఐ తెలిపింది. దభోల్కర్ హత్య కేసు నిందితుల్లో ఒకరైన సచిన్ అందురే కస్టడీని పొడిగించాలని పుణే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టును కోరుతూ ఈ విషయం వెల్లడించింది. లంకేశ్ హత్యతో ప్రమేయమున్న నిందితుల్లో ఒకరు అందురేకు పిస్టోల్, మూడు బుల్లెట్లు అందచేసినట్లు సీబీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టు సచిన్ అందురే కస్టడీని ఆగస్టు 30 వరకూ పొడిగించింది. మరోవైపు దభోల్కర్ హత్య కేసులో మరో నిందితుడు శరద్ కలస్కర్‌ను కూడా తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం కలస్కర్ మరో కేసుకు సంబంధించి మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) అదుపులో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment