సాక్షి, ముంబై: మహారాష్ట్రను గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. అనేక జిల్లాలు, నగరాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోంది. గత వారం రోజుల్లో ఏకంగా మూడు లక్షల మందికిపైగా కరోనా సోకింది. మరోవైపు పుణేలో మినీ లాక్‌డౌన్ ప్రకటించారు. శనివారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ అక్కడ పరిస్థితి అదుపులోకి రాలేదు. పుణె మున్సిపల్ కార్పొరేషన్‌లో శనివారం ఒక్కరోజే 5,778 కరోనా కేసులు నమోదు కాగా 37 మంది మృతి చెందారు. ఈనేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తేవడానికి పుణె పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.
కరోనా బారినపడకుండా అనుసరించాల్సిన ముందు జాగ్రత్త చర్యలతో ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ అయింది. కాగా, కొంత మంది ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడానికి నిరాకరిస్తున్నారు. అలాంటివారిని ఉద్దేశించి పుణే పోలీసులు ఈ వీడియోను రూపొందించారు. ‘మాస్క్ పెట్టుకోవడం చిరాకుగా ఉంది. అసలు మాస్క్ ను అసలు ధరించలేను’ అంటూ చెప్పే వారి కోసమే ఈ వీడియో అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. దివ్యాంగులు మాస్క్ పెట్టుకోవడానికి లేని ఇబ్బంది సాధారణ ప్రజలకు ఏంటి? మాస్క్ ను ఎల్లప్పుడూ ధరించాలని, బాధ్యత గల పౌరులుగా వ్యవహరించాలనేది వీడియో సారాంశం.
‘It’s feels so hot, can’t wear this mask’ - If you have used these words recently, then this video is for YOU.#WearAMask #COVIDSecondWave #coronavirus pic.twitter.com/9qKjXPCvLw
— PUNE POLICE (@PuneCityPolice) April 4, 2021
చదవండి: మహారాష్ట్రలో కరోనా విజృంభణ
Comments
Please login to add a commentAdd a comment