కొవిడ్ వైరస్ బారిన పడినవారిలో ఇప్పటికీ కొన్ని స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అలాంటి వారికోసం రెమిడియమ్ థెరపెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీ ఫార్మాసూటికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ సంయక్తంగా ‘కోరోక్విల్-జెన్’ అనే ఔషధాన్ని తయారు చేశాయి. ఈమేరకు తాజాగా ఈ డ్రగ్ భారత ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతులు కూడా పొందింది.
ఈ సందర్భంగా రెమిడియమ్ థెరపెటిక్స్ సీఈఓ కృష్ణన్ మాట్లాడుతూ..‘కొవిడ్ వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటికీ స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని అదుపు చేసేందుకు రెమిడియం థెరపెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్-చెన్నై, ఢిల్లీ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ యూనివర్శిటీ సహకారంతో ‘కోరోక్విల్-జెన్’ను అభివృద్ధి చేశాయి. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్న జింక్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు, యాంటీవైరల్ మిశ్రమం ఇందులో ఉంటుంది. దానివల్ల కొవిడ్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుకోవచ్చు. ఈ ఔషధాన్ని వాడే రోగులు ఐసీఎంఆర్ విడుదల చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి. ఈ డ్రగ్‌కు తాజాగా భారత ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతులు లభించాయి. కొవిడ్‌తో కలిగే అనారోగ్య సమస్యలతోపాటు క్షయ, ఆస్తమా, సీజనల్ అలర్జీలు, పల్మనరీ, ఇతర శ్వాసకోశ రుగ్మతల చికిత్సలో కోరోక్విల్-జెన్ ఉపయోగించేందుకు లైసెన్స్ లభించింది’ అన్నారు.
ఇదీ చదవండి: ఈపీఎఫ్‌ఓలో వ్యక్తిగత వివరాలు మార్చుకోండిలా..!
Comments
Please login to add a commentAdd a comment