![Pune Police Files Charge Sheet On Urban Naxals - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/21/vara.jpg.webp?itok=FLI5uWg7)
పుణే : బీమా కొరేగావ్ కేసులో అర్బన్ నక్సల్స్‌పై పుణే పోలీసులు 1837 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేశారు. పౌరహక్కుల కార్యకర్త, విరసం నేత వరవరరావు, గణపతి, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నోన్ గోన్‌సాల్వ్స్‌పై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. బీమా కొరేగావ్ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే అభియోగంపై వరవరరావు సహా పలువురు హక్కుల కార్యకర్తలను గత ఏడాది పుణే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మావోయిస్టులతో విప్లవ సంఘాల నేతలకు సంబంధాలున్నాయని, మావోయిస్టుల లేఖ ఆధారంగానే అర్బన్ నక్సల్స్‌ను అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతుండగా, అకారణంగా తమను అరెస్ట్ చేశారని, మావోయిస్టుల లేఖ కల్పితమని వరవరరావు గతంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment