
పుణే : బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళ మటోండ్కర్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్ చేసినందుకు పుణేకు చెందిన 57 సంవత్సరాల వ్యక్తిని పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ధనుంజయ్ కుడ్తార్కర్ తన సోషల్ మీడియా ఖాతాను ఉపయోగించి ఊర్మిళా మటోండ్కర్‌పై అభ్యంతరకరమైన పోస్ట్ అప్‌లోడ్ చేశారని పుణేలోని విశారామ్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి వెల్లడించారు.
ధనుంజయ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. కాగా, నిందితుడిని ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదు. బాలీవుడ్ సహా పలు భాషా చిత్రాల్లో నటించిన ఊర్మిళ లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్ధి గోపాల్ షెట్టి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment