ముంబై: విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. రిజర్వేషన్ల అమ లు విషయంలో చట్టపరిధిలో విధివిధానాలు ఖరారు చేయడానికి కొంత సమయం అవసరమని చెప్పారు. రిజర్వేషన్ల అంశంపై మరాఠా ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి షిండే నేతృత్వంలో బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది.
రిజర్వేషన్ల కోసం మరాఠాలు చేపడుతున్న ఆందోళనలు, జరుగుతున్న హింసాకాండపై చర్చించారు. నిరవధిక దీక్ష విరమించాలని సామాజిక కార్యకర్త మనోజ్ జారంగీని కోరుతూ అఖిలపక్ష భేటీలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానంపై ముఖ్యమంత్రి షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన(ఉద్ధవ్‌వర్గం) నాయకుడు అనిల్ పారబ్ తదితరులు సంతకాలు చేశారు. అనంతరం సీఎం షిండే మీడియాతో మాట్లాడారు. హింసకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించవద్దని రాజకీయ పారీ్టలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment