ముంబై: లాక్‌డౌన్ ఉపసంహరణపై సహనంతో జాగత్తగా వ్యవహరిస్తున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఈ నెల 3 తర్వాత కచ్చితంగా లాక్‌డౌన్ సడలింపులు ఉంటాయని ఆయన వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించిన తర్వాత సడలింపులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. (ప్రత్యేక రైళ్లు వేయండి: మోదీ)
‘మే 3 తర్వాత కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో పరిస్థితులను అంచనా వేసిన తర్వాత కచ్చితంగా లాక్‌డౌన్‌ను సడలిస్తాం. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాం. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇప్పటివరకు మనం సాధించిందంతా వృథా అవుతుంది. కాబట్టి సంయమనంతో అప్రమత్తంగా వ్యవహరిస్తాం. కోవిడ్-19 గురించి అతిగా భయపడొద్దని ప్రజలను కోరుతున్నాను. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా కరోనా బారి నుంచి బయటపడొచ్చు. వైరస్ సోకిన కొన్ని రోజుల పసికందు నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇంటికి వెళ్లారు. వెంటిలేటర్‌పై ఉన్నవాళ్లు కూడా కోలుకున్నార’ని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ గడువు ఈనెల 3న ముగియనుంది. గడువు ఇంకా పొడిగిస్తారా, లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా బాధితులు ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం మహారాష్ట్రలో 10,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 459 మరణాలు సంభవించాయి. (కరోనా విపత్తు: భారీ ఉపశమనం)
Comments
Please login to add a commentAdd a comment