పుణే: మహారాష్ట్రలో లాక్‌డౌన్ వంటి నిబంధనలు మరో 15 రోజుల పాటు కొనసాగుతాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే శుక్రవారం వెల్లడించారు. అయితే ఆ లాక్‌డౌన్‌కు సంబంధించిన నిబంధనల మార్గదర్శకాలను జూన్ 1న విడుదల చేస్తామని స్పష్టం చేశారు. గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.
లాక్‌డౌన్ విషయంపై మాట్లాడుతూ మరో 15 రోజుల పాటు తప్పకుండా కొనసాగుతుందని అన్నారు. అయితే కరోనా కేసులు, పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం నిబంధనల్లో సడలింపు ఉంటుందని తెలిపారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే గురువారం మాట్లాడుతూ జూన్ 1 వరకు నిబంధనలు ఉంటాయని, ఆ తర్వాత దశల వారీగా ఎత్తేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment