సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తొలి మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. శివసేన చీఫ్ ఉద్ధవ్ సీఎంగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల నుంచి ఇద్దరు చొప్పున మంత్రులుగా నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, డిసెంబర్ 30న ఉద్ధవ్ మంత్రివర్గాన్ని విస్తరించనున్నారని ఒక వార్తా చానెల్ వెల్లడించింది. ఆ చానెల్ ప్రకారం.. శివసేన నుంచి 13 మందిని, ఎన్సీపీ నుంచి 13 మందిని, కాంగ్రెస్‌కు చెందిన 10 మందిని మంత్రివర్గంలో చేర్చుకోనున్నారు. శివసేన, ఎన్సీపీలకు 10 కేబినెట్, 3 సహాయ మంత్రి పదవులు ..కాంగ్రెస్ నుంచి 8 మంది కేబినెట్, ఇద్దరు సహాయ మంత్రులు కానున్నారు. అయితే, ఉద్ధవ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించనుందనే విషయంపై స్పష్టత రాలేదు. ఎన్సీపీ నుంచి అజిత్ పవార్, జయంత్ పాటిల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment