
ముంబై: ఏక్‌నాథ్ షిండే– బీజేపీ నేతృత్వంలోని రాష్ట్రపాలనను వ్యతిరేకిస్తూ ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం, నేషనలిస్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ (మహా వికాస్ అఘాడీ–ఎంవీఏ) కూటమి ఆధ్వర్యంలో ముంబైలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఛత్రపతి శివాజీ మహరాజ్, మహా త్మా ఫూలే వంటి మహనీయులను మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోష్యారీ అవమానించడాన్ని ఎంవీఏ కూటమి తీవ్రంగా తప్పబట్టింది.
కోష్యారీని గవర్నర్ పదవి నుంచి వెంటనే తప్పించాలని కూటమి అగ్రనేతలు డిమాండ్‌చే శారు. ముంబైలోని బైకుల్లాలో ప్రారంభమైన ‘హల్లా బోల్’ నిరసన ర్యాలీ.. నాలుగు కిలో మీటర్లు కొనసాగి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ వద్దకు చేరుకున్నాక ఉద్ధవ్ ఠాక్రేసహా కూటమి నేతలు ర్యాలీ వేదికపై ప్రసంగించారు. ‘ గవర్నర్‌ను పదవి నుంచి వెంటనే తప్పించాలి. లేదంటే మీకు గుణపాఠం నేర్పిస్తాం’ అని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ హెచ్చరించారు.