హైదరాబాద్: వచ్చే నెల 15న ముంబయిలో గోదావరి అంతర్రాష్ట్ర మండలి సమావేశం కానుంది. ఆ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మహారాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి, ఇరురాష్ట్రాల ఇరిగేషన్ కార్యదర్శులతో పాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో మేడిగడ్డ, తుమ్మడిహట్టి, చనాఖా-కొరాటా బ్యారేజీల నిర్మాణం విషయమై తుది ఒప్పందం జరగనుంది. కాగా కొద్దిరోజుల క్రితం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగింది. అనంతరం మహారాష్ట్ర సీఎంను ...హరీశ్ హైదరాబాద్ రావల్సిందిగా ఆహ్వానించారు.