సబ్సిడీ సిలిండర్లు నాకొద్దు: సీఎం | devendra fadnavis returns subsidy gas cyllinder | Sakshi
Sakshi News home page

సబ్సిడీ సిలిండర్లు నాకొద్దు: సీఎం

Jan 14 2015 4:43 PM | Updated on Sep 2 2017 7:43 PM

సబ్సిడీ సిలిండర్లు నాకొద్దు: సీఎం

సబ్సిడీ సిలిండర్లు నాకొద్దు: సీఎం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తనకు సబ్సిడీ సిలిండర్ వద్దని.. దాన్ని తిరిగిచ్చేశారు.

రాజకీయ నాయకులు ఒక్కొక్కళ్లు ఏడాదికి కొన్ని వందల రాయితీ సిలిండర్లను వాడుతుంటారు. అయితే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాత్రం అందుకు భిన్నంగా, ఆదర్శంగా వ్యవహరించారు. తనకు సబ్సిడీ సిలిండర్ వద్దని.. దాన్ని తిరిగిచ్చేశారు. రాయితీ లేని గ్యాస్ సిలిండర్లనే తాను ఉపయోగిస్తానని చెప్పారు. తనతో పాటు సహచర మంత్రులు కూడా అందరూ రాయితీ లేని గ్యాస్ సిలిండర్లనే ఇళ్లలో వాడుకోవాలని దేవేంద్ర ఫడ్నవిస్ పిలుపునిచ్చారు.

అల్పాదాయవర్గాలు, మధ్యతరగతి కోసం ఇస్తున్న సబ్సిడీని ఉన్నతాదాయ వర్గాల వాళ్లు కూడా వినియోగించుకోవడం వల్ల ప్రభుత్వాలపై సబ్సిడీ భారం పెరిగిపోతోందని ఇటీవల ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. దాంతో ఫడ్నవిస్ తనంతట తాను స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement