ముంబై: మహారాష్ట్ర వైద్య శాఖ మంత్రి దీపక్ సావంత్ వ్యక్తిగత కార్యదర్శి తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళా డాక్టర్ ఆరోపించింది. జల్గావ్ జిల్లాకు వైద్యురాలు ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు లేఖ రాసింది.
గత మార్చిలో మంత్రి సావంత్ను కలిసేందుకు వెళ్లినపుడు ఆయన పీఎస్ సునీల్ మాలి తనను మరో ఛాంబర్లోకి తీసుకెళ్లి దాదాపు రెండుగంటల సేపు అనుచితమైన, వ్యక్తిగత సంబంధిత ప్రశ్నలు అడిగినట్టు వైద్యురాలు ఆరోపించింది. అతడిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరింది. ఈ ఘటన జరిగిన తర్వాత మూడు నెలల వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న మీడియా ప్రశ్నకు.. తనను బదిలీ చేస్తారని భయపడ్డానని ఆమె చెప్పింది. సునీల్ ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు ఇప్పుడు మరికొందరు ముందుకు వచ్చారని, దీంతో తాను సీఎంకు లేఖ రాశానని వెల్లడించింది. కాగా వైద్యురాలి ఆరోపణలను సునీల్ తోసిపుచ్చాడు. తనను అప్రతిష్టపాలుజేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించాడు.
సీఎంగారూ.. మంత్రిగారి పీఎస్ వేధించాడు
Published Sun, Jun 19 2016 8:13 PM | Last Updated on Mon, Oct 8 2018 5:57 PM
Advertisement