
టిక్ టాక్ వీడియోతో ఉద్యోగం పోగొట్టుకున్న గుజరాత్‌కు చెందిన పోలీసు కానిస్టేబుల్ అర్పితా చౌదరి గుర్తున్నారా? ప్రస్తుతం ఇపుడు ఈమె ఉద్వాసనలు, హెచ్చరికలను పక్కన పెట్టి తనకిష‍్టమైన రంగంలో రాణించేందుకు సిద్ధమవుతోంది. పోలీస్ స్టేషన్‌లో టిక్‌టాక్ వీడియో చేయడంతో పై అధికారుల ఆగ్రహానికి గురైన ఆమె తాజాగా మరో వీడియోతో హల్ చల్ చేస్తోంది. సొంతంగా ఒక మ్యూజిక్ వీడియోను చేసి విడుదల చేసింది. టిక్‌టాక్ ని దివానీ పేరుతో వచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌గా మారింది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ వీడియోకు 20లక్షల 50వేలకు పై గా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ పాటను జిగ్నేష్ కవిరాజ్ పాడగా.. మయూర్ నదియా సంగీతం అందించాడు. మను రబారి లిరిక్స్‌ను రాశాడట.
Comments
Please login to add a commentAdd a comment